ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ 193 బంతుల్లో (90), కేఎల్ రాహుల్ 153 బంతుల్లో (62) పరుగుల చేశారు. ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ సిక్సర్లు(34) కొట్టిన ప్లేయర్ రికార్డు నమోదు చేశాడు. 2014 లో బ్రెండన్ మెక్ కల్లమ్ (33సిక్స్ లు) బాదగా ఇప్పుడు ఆ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు.