మానసిక ఆరోగ్యం అనేది చాలాకాలంగా పౌర సమాజం విస్మరిస్తున్న నిశ్శబ్ద సంక్షోభం. వర్క్‌ప్లేస్ సర్వేలో మెంటల్ హెల్త్ అండ్ వెల్నెస్ కోషెంట్ అనేది ఉండాలి. 2023 నేషనల్ మెంటల్ హెల్త్ సర్వేలో 42శాతం కార్పొరేట్ భారతీయులు నిరాశ లేదా ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న ముగ్గురిలో ఇద్దరు ఇప్పటికీ పనిలో లేదా కొత్త ఉ ద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. పది మందిలో ఒకరికి మాత్రమే ‘ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ యాక్సెస్ ఉంది. మన శ్రామిక శక్తిలో దాదాపు సగం మంది మానసిక ఆ రోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ప్ర మాదంలో ఉన్నారు.
ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని శాస్త్రీయ పద్ధతిలో అర్థం చేసుకోవాలి, కార్యాలయంలో మానసిక ఆరోగ్యానికి కారణమయ్యే అంశాలు గుర్తించాలి, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ‘ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 3’ని చేరుకోవడానికి సీఎస్‌ఆర్ నిధులు, వనరుల దృక్పథాన్ని పునర్నిర్వచించడంలో సహాయపడుతుంది. నిమ్ హాన్స్ 2022- 23 సర్వే ప్రకారం, దేశంలో దాదాపు 18 శాతం పెద్దలు ఏదో ఒక రకమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దిమందికి మాత్రమే అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మానసిక వైద్యుల కొరత తీ వ్రంగా ఉంది. 145 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశంలో 9,000 కంటే తక్కువ మంది మానసిక వైద్యులు ఉన్నారు.
మానసిక అనారోగ్యం భారతదేశంలో ఎక్కువగా నిషిద్ధ అంశంగా కొనసాగుతోంది.ఈ సంవత్స రం చివరినాటికి దేశంలో సుమారు 20 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య లెక్కలను చూస్తే 5.6 కోట్ల్ల భారతీయులు నిరాశతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆరోగ్యం, సామాజిక, మానవ హక్కులు, ఆర్థిక పరిణామాలపై గణనీయమైన ప్రభావాలతో మానసిక రుగ్మతల భారం పెరుగుతూనే ఉంది. పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు దీని బారిన పడుతున్నారు.
వీటి ప్రభావంతో మనుషులు ఆత్మహత్య చేసుకుంటారు .మానసిక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక 2020-2023 ప్రజలందరికీ ఆరోగ్యాన్ని సాధించడంలో పూర్తిగా విఫలమైంది మానసిక రుగ్మతలతో బాధపడుతూ నిరాశ్రయులుగా ఎవరైనా కనపడితే ‘మనోబంధు’ దృష్టికి తీసుకు రండి. స్థానిక అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో వారిని ఆస్పత్రిలో చేర్పించి స్వస్థత చేకూరిన తర్వాత వారి కుటుంబాలకు చేరుస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరాశ్రయులుగా సంచరించే ఒక్క మానసిక రోగి కూడా లేకుండా అందరినీ ఆసుపత్రి లేదా షెల్టర్ హోమ్‌లో చేర్పించే కార్యక్రమంలో పౌర సమాజం భాగస్వామ్యం కావాలి.
డా. ముచ్చుకోట సురేష్ బాబు