calender_icon.png 23 February, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణిలో పెరుగుతున్న రాజకీయ జోక్యం

19-02-2025 07:57:29 PM

ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ...

మందమర్రి (విజయక్రాంతి): కోల్ బెల్ట్ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు కార్మిక సమస్యలు పరిష్కరించకుండా, ఇష్టానుసారంగా సింగరేణి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తూ పైరవీలకు పాల్పడుతున్నారని, కొన్ని ప్రభుత్వ సంఘాలు మా ప్రభుత్వమే అధికారంలో ఉందని అధికారుల దగ్గర పబ్బం గడుపుకుంటున్నారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ ఆరోపించారు. బుదవారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి దాదాపు సంవత్సరం కాలం ముగిసినప్పటికీ ఇప్పటివరకు కార్పొరేట్ స్థాయిలో ఒక స్ట్రక్చరల్ కమిటీ సమావేశం మాత్రమే జరిగినదని, తదుపరి సమావేశాల గురించి అడిగినప్పుడు డైరెక్టర్లు లేరు, అధికారులు లేరు అని కాలయాపన చేస్తున్నారనీ మండిపడ్డారు.

ఏరియాలో 2,3 స్ట్రక్చరల్ కమిటీ సమావేశాలు నిర్వహించి, కొన్ని సమస్యలు పరిష్కారం దిశగా ఒప్పందం జరిగాయని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చిందని, అందుకే ఏఐటీయూసీ సైతం ప్రజా ప్రతినిధుల గెలుపు కృషి చేసిందని ఆయన గుర్తు చేశారు. పెర్క్స్ పై ఐటి ని యాజమాన్యమే చెల్లించడం, ఉద్యోగులకు సొంతింటి పథకం అమలు చేయిస్తామని లేదా కార్మికులకు మిగులు క్వార్టర్లు లేదా 300 గజాల స్థలము 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం తమ ప్రభుత్వం గెలిస్తే యాజమాన్యంతోనే ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినందున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సిఎండితో మాట్లాడి, తక్షణమే ఈ రెండు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు‌‌. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా గత ప్రభుత్వం లాగా ప్రజా ప్రతినిధులతో సింగరేణి సంస్థ నడుస్తున్నదని, ఈమెయిల్ జోక్యం జరుగుతున్నదని ఆరోపించారు.

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించారు కానీ ఎన్నికల నియమ నిబంధనలు లేవని,  కోడ్ ఆఫ్ డిసిప్లెన్ ఏమైందని ప్రశ్నించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎందుకు పెట్టారని, కోడ్ ఆఫ్ డిసిప్లేన్ ఏమైందని, కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఏఐటీయూసీ సంఘాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని, సింగరేణిలో రాజకీయ జోక్యం తగదన్నారు. అదేవిధంగా సింగరేణికి రావలసిన 29 వేల కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని, సింగరేణికి ఇప్పించాలని డిమాండ్ చేశారు‌. కార్మికులకు రక్షణ పరికరాలను, పనిముట్లను అందించి, బొగ్గు ఉత్పత్తికి తోడ్పడాలని కోరారు. కార్మికులకు సొంతింటి పథకం, ఆదాయపన్ను రద్దు త్వరగా అమలు చేయకుంటే తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.

సింగరేణి ప్రాంతంలో రాజకీయ జోక్యంతో మంచి క్వార్టర్లు అన్ని అక్రమానికి గురయ్యాయని, కార్మికుడు క్వార్టర్ కావాలంటే క్వార్టర్ దొరకడం లేదని, ఇల్లీగల్ క్వార్టర్స్ ను సింగరేణి యాజమాన్యం ఆధీనంలోకి తీసుకొని, సింగరేణి ఉద్యోగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్, జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, అసిస్టెంట్ కార్యదర్శి సోమిశెట్టి రాజేశం ఏరియా నాయకులు పి బానయ్య, సివి రమణ, సుదర్శన్ రెడ్డి, అర్నకొండ అంజయ్య, టేకుమట్ల తిరుపతి, ఎగ్గేటి రాజేశ్వరరావు, జెట్టి మల్లయ్య, ఆంథోని దినేష్, పిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, యాదవ్, కలువల శ్రీనివాస్, సంజీవ్ కుమార్, కే ఓదెలు లు పాల్గొన్నారు.