11-04-2025 12:52:07 AM
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని, ఈ వ్యాధి ప్రపంచంలోనే రెండో అత్యంత న్యూరోడీజెనరేటివ్ డిజార్డర్‌గా గుర్తింపుపొందిందని హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ వైద్యు లు పేర్కొన్నారు. ‘సాధారణ భాషలో వణుకుడు వ్యాధి (షేకింగ్ డిసీజ్) అనే ఈ వ్యాధి మెదడులో నాడీ కణాలు దెబ్బతినడం వల్ల వస్తుంది.
భారతదేశంలో వివిధ అధ్యయనాల ప్రకారం ప్రతి లక్ష మంది జనాభాకు 15 నుంచి 43 మందిలో ఈ పార్కిన్సన్స్ వ్యాధి ప్రాబల్యం ఉంది. పెరుగుతున్న ఆ యుర్దాయం, వృద్ధాప్య జనాభాతో పార్కిన్స న్స్ వ్యాధి భారం మన దేశంలో ఎక్కువగా ఉంటుందని’ యశో దా ఆస్పత్రి న్యూరో వై ద్య నిపుణులు చెబుతున్నారు.
25 సంవత్సరాలకు పైగా అపారమైన అ నుభవం ఉన్న పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూవ్‌మెంట్ డి జార్డర్స్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్, సీనియర్ న్యూరాలజిస్ట్, డాక్టర్ రూ పమ్ బోర్గోహైన్ మాట్లాడుతూ.. ఈ పార్కిన్సన్స్ వ్యాధి ప్రధానంగా మెదడులో డోప మైన్ ఉత్పత్తి చేసే న్యూరాన్లను కోల్పోవడం, ఇత ర న్యూరోట్రాన్స్ మీటర్లు ఉత్పత్తి చేసే న్యూరాన్లను కోల్పోవడం వల్ల వస్తుందని వివరించారు.
పార్కిన్సన్స్ వ్యాధి జన్యు, పర్యావర ణ కారకాల మధ్య సంక్లిష్ట పరస్పర చర్యల కారణం గా సంభవిస్తుందని చెప్పారు. యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్లు డాక్టర్ రుక్మిణీ మృదుల, డాక్టర్ రాజేశ్ అలుగోలు, డాక్టర్ శృతి కోలా, డాక్టర్ ప్రసాద్‌తో ప్రొఫెసర్, డాక్టర్ రూపం బోర్గోహైన్ బృం దం 25 సంవత్సరాల పాటు విస్తృత అనుభవాన్ని కలిగి ఉంది.