హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): పాఠశాలస్థాయిలో చదువు తున్న బాలికల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ శాలల్లో చదువుతున్న బాలికల సంఖ్య పెరుగుతోందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 2022 విద్యాసంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చేరినవారు మొత్తం 27,85, 741 మంది ఉండగా, 2023 28,46,583 మందికి చేరారు. ఇందులో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 2022 13,99, 876 మంది చేరితే, ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో 8,56,405 మంది, తొమ్మిది, పది తరగతుల్లో 5,29,460 మంది చేరారు. 2023 1 తరగతుల్లో 14,22,743 మంది చేరగా, ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో 8,82,939 మంది, తొమ్మిది, పదో తరగతుల్లో 5,40,901 మంది చేరారు.