calender_icon.png 17 November, 2024 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజినీరింగ్ సీట్ల పెంపు కష్టమే!

17-11-2024 02:12:00 AM

  1. ఈ విద్యా సంవత్సమే అనుమతివ్వని సర్కారు
  2. కోర్ గ్రూపులపై ఆసక్తి కనబర్చని యాజమాన్యాలు
  3. ప్రతి యేటా భారీగా మిగులుతున్న సీట్లు
  4. నిబంధనల ఉల్లంఘనపై సర్కారు దృష్టి
  5. కొత్త కాలేజీలకు ఏఐసీటీఈ దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, నవంబర్ 1౬ (విజయక్రాంతి): రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్ సీట్ల పెంపు, కోర్సుల కన్వర్షన్, కొత్త కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇష్టారీతిన కాలేజీల ఏర్పాటు, కోర్ గ్రూపుల్లోని సీట్లను తగ్గించి డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుతున్న కళాశాలలపై ప్రభుత్వం దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది.

భవిష్యత్తులో అన్ని రంగాల్లో మానవ వనరుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో చేరే వారి సంఖ్యను పెంచి, సమతుల్యత పాటించాలని సర్కారు యోచిస్తున్నది. ఇందులో భాగంగానే ఈ విద్యాసంవత్సరంలో 9వేల సీట్లకు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి.

జేఎన్టీయూ ఎన్‌వోసీ ఇవ్వగా, అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సైతం అనుమతిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అడ్డుకట్ట వేసింది. దీంతో ఆయా కాలేజీలు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

మరోవైపు వచ్చే విద్యా సంవత్సరానికి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీసీఏ, పాలిటెక్నిక్ వంటి కోర్సులను నడిపేందుకు కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోవాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ సింగిల్‌విండో సిస్టమ్ వెబ్‌సైట్ ద్వారా డిసెంబర్ 18 నుంచి జనవరి 26 వరకు దరఖాస్తు చేసుకోవాలని..

పాత కళాశాలల అనుమతుల పొడిగింపునకు ఈనెల 25 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కొత్త కాలేజీల ఏర్పాటుకు, పాత కాలేజీల అనుమతికి ఆలస్య రుసుంతో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువిచ్చింది. ఒకవేళ కొత్త కాలేజీల ఏర్పాటు, సీట్ల పెంపునకు ఏఐసీటీఈ అనుమతిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా? అనేది అనుమానమే.

భారీగా మిగులుతున్న సీట్లు...

ప్రతి ఏడాది ‘ఇంజినీరింగ్’ కౌన్సిలింగ్‌ను మూడు విడుతల్లో చేపట్టినా సీట్లు పూర్తిగా భర్తీ కావడం లేదు. 2020 మొత్తం 180 కాలేజీలుండగా వీటిలో 98,988 సీట్లున్నాయి. అయితే ఆ విద్యాసంవత్సరంలో 65,720 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 2021 175 కాలేజీల్లో 1,09,773 సీట్లకు గానూ 77,700 మాత్రమే భర్తీ అ య్యాయి. 2022 1,08,715 సీట్లకు గానూ 82,350 సీట్లు భర్తీ అయ్యాయి.

2023 సీట్ల సంఖ్యను గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా పెంచారు. అయితే 1,17,426 సీట్లకు 91,001 మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రస్తుత (2024 విద్యాసంవత్సరంలో 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1,11,600 సీట్లుండగా, చివరి విడత కౌన్సిలింగ్ పూర్తయ్యేనాటికి కన్వీనర్ కోటాలో 75,107మంది చేరారు. స్పాట్, బీ కేటగిరీ సీట్లు కలిపి దాదాపు లక్ష వరకు నిండాయి.

156 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 1,05,965 సీట్లు ఉండగా.. స్పాట్ కౌన్సిలింగ్ తర్వాత సుమారు ౧౦వేల సీట్లు మిగి లాయి. మొత్తంగా సీఎస్‌ఈ, ఐటీ కోర్సు ల్లో సీట్లు భర్తీ కావడం, కోర్ గ్రూపుల్లో సీట్లు మి గులుతుండటంతో వచ్చే విద్యాసంవత్సరం లో కాలేజీల ఏర్పాటు, సీట్ల పెంపునకు ప్ర భుత్వం అనుమతులు ఇవ్వడం అసాధ్యం. 

‘కోర్’ను కాపాడుకునేలా...

ప్రస్తుతం ఇంజినీరింగ్ అంటే సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత గ్రూపులే అన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్ బ్రాంచీలైన బీటెక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను కాపాడుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసా రిస్తోం ది. ప్రతి ఏడాది ఈ కోర్ బ్రాం చీల్లో నాలుగోవంతు సీట్లు కూడా భర్తీ కావ డం లేదు కానీ.. కంప్యూటర్ సైన్స్ ఇం జినీరింగ్, ఐటీ కోర్సుల్లో 90 శాతానికి పైగా సీట్లు నిండుతున్నాయి.

ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగ, ఉ పాధి అవకాశాలు లభించే కోర్సు ల్లో జాయిన్ అయ్యేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో  ఏటా ఇంజి నీ రింగ్ సీట్లు భారీగా మిగులుతున్నా యి. ఇంత జరుగుతున్నా కాలేజీలు మా త్రం ప్రతి ఏడాది సీట్ల సంఖ్యను పెం చుతూనే ఉన్నాయి. డిమాండ్‌లేని కో ర్సులను సీఎస్‌ఈ, ఐటీ అనుంబం ధ కోర్సులకు మార్చుకుంటున్నాయి.