11-12-2024 12:00:00 AM
హైదరాబాద్‌లో కరెంటు వినియోగం రోజురోజుకూ భారీ ఎత్తున పెరుగుతున్న మాట వాస్తవమే. ప్రజలు ప్రతి దానికి విద్యుత్‌పైనే ఆధారపడుతున్నారు. ఇళ్లలో విద్యుచ్ఛక్తితో పనిచేసే రకర కాల యంత్రాలు వచ్చేశాయి. ఎవరూ భౌతిక శ్రమకు సమయాన్ని కేటాయించడం లేదు. ఇటీవలి కాలంలో విద్యుత్ వాహనాల సంఖ్యకూడా అంతకంతకూ పెరుగుతున్నది.
మొత్తం ఎస్‌పీడీసీఎల్ పరిధిలోనే హైదరాబాద్ జంటనగరాలు అత్యధిక మొత్తంలో విద్యుత్ వినియోగాన్ని నమోదు చేస్తున్న విషయాన్ని ‘విజయక్రాంతి’ పత్రిక ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ కోసం ప్రత్యేక డిస్కమ్ ఏర్పాటును ప్రభుత్వం పరిశీలించాలి.
రాంరెడ్డి.కె, సంగారెడ్డి