calender_icon.png 2 February, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్యాంకర్లకు పెరుగుతున్న బుకింగ్స్

02-02-2025 01:07:14 AM

  1. నగరంలో అడుగంటుతున్న భూగర్భ జలాలు
  2. జలమండలి పరిధిలో రోజుకు 600కు పైగా ట్యాంకర్ల నీటి సరఫరా
  3. గతేడాదితో పోలిస్తే  50శాతం ఎక్కువ బుకింగ్స్
  4. వేసవిలో మరింత పెరిగే అవకాశం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి ౧ (విజయక్రాంతి): వేసవి ప్రారంభం కాకముందే గ్రేటర్ సహా ఓఆర్‌ఆర్ వరకు ఉన్న ప్రజలకు తాగునీరు సరఫరా చేసే హైదరాబాద్ జలమండలిలో రోజువారీ వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ పెరుగు   గతేడాది జనవరితో పోలిస్తే ఈ  వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ దాదాపు 50శాతం ఎక్కువగా నమోదైనట్లు సమా  గ్రేటర్‌లోని పలు ఓఅండ్‌ఎం డివిజన్లలో ఈ బుకింగ్‌ల సంఖ్య ఎక్కువగా నమో  తెలుస్తోంది.

ఇదిలా ఉండగా గ్రేటర్‌లో క్రమంగా భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. గతేడాది డిసెంబర్ నాటికి నగరంలో భూగర్భ జలాలు 6.96 మీటర్ల లోతుకు చేరుకోగా.. ప్రస్తుతం నగరంలో సగటున భూగర్భ జలాలు దాదాపు 8మీటర్ల లోతుకు చేరి ఉంటాయని భూగర్భశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో మరింత లోతుకు చేరే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. 

బుకింగ్స్ ఎక్కువగా వస్తున్న డివిజన్లు..

జలమండలి పరిధిలో మొత్తం 22 ఓఅండ్‌ఎం డివిజన్లుండగా.. జలమండలి సరఫరా చేసే నల్లా నీటితో పాటు వివిధ ప్రాంతాల్లోని వినియోగదారులు వాటర్ ట్యాంకర్లను బుకింగ్ చేసుకుంటున్నారు. 78 వాటర్ ఫిల్లింగ్ పాయింట్ల ద్వారా.. దాదాపు 600లకు పైగా వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజూ  జలమండలి వాటర్ ట్యాంకర్లను సరఫరా చేస్తోంది.

గత ఏడాది మూడు నెలల్లోనే దాదాపు 7లక్షల వాటర్ ట్యాంకర్లను సరఫరా చేసింది. అయితే ఈ నెలలో జలమండలి పరిధిలోని దుర్గంచెరువు, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి, నిజాంపేట్, హఫీజ్‌పేట్, మణికొండ, హఫీజ్‌పేట, ఆసీఫ్‌నగర్, అల్వాల్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ గతేడాది జనవరి కంటే దాదాపు 50శాతం ఎక్కువగా నమోదు అయినట్లు సమాచారం.

గతేడాది వాటర్ ట్యాంకర్ల సరఫరాలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా, ఈసారి సకాలంలో డెలివరీ చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా వినియోగదారులు చేసుకుంటున్న వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్‌లో దాదాపు 10-15శాతం మంది వాటర్ ట్యాంకర్లను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు, ముందస్తుగా బుక్ చేసుకోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది.

కాగా కొన్ని డివిజన్లలో వాటర్ ట్యాంకర్లు ఇప్పటికే రెండు ట్రిప్పులు, మరికొన్ని చోట్ల మూడు ట్రిప్పులు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇది రాబోయే రోజుల్లో రెండు, మూడింతలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే జలమండలి అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. 

త్వరలో ప్రత్యేకాధికారుల నియామకం..

వేసవిలో తాగునీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పలువురు ప్రత్యేకాధికారులను నియమించాలని యోచిస్తున్నుట్లు సమాచారం.

ఎక్కువగా వాటర్ ట్యాంకర్లు బుక్ అయ్యే ప్రాంతాల్లో వీరిని నియమించనున్నారు. బుకింగ్‌లు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు డివిజన్‌కు ఒక డీజీఎం స్థాయి అధికారిని నియమిస్తారు. వాటర్ ట్యాంకర్ల డెలివరీలో పెండెన్సీ లేకుండా వీరు చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.