calender_icon.png 28 February, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిగిన పోలింగ్ శాతం

28-02-2025 01:26:07 AM

  1. నల్లగొండ టీచర్ స్థానానికి 93.55%, కరీంనగర్ స్థానానికి 83.24% ఓటింగ్  
  2. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో 63.09% 
  3. మార్చి 3న ఓట్ల లెక్కింపు

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాం తి): రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గురు వారం జరిగిన పోలింగ్ ప్రశాంతం గా ముగిసింది. ఉదయం  8 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఈ మూడు ఎమ్మెల్సీ నియోజక వర్గాల్లో పోలింగ్ శాతం పెరిగినట్టు సీఈవో సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.

నల్లగొండ-వరంగల్- ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవ ర్గంలో 93.55% టీచర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోగా, కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గం లో 83.24 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే నియోజకవర్గంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నిక లో 63.09 శాతం ఓటింగ్ నమోదైంది.

ఈ బ్యాలెట్ బాక్సులను కరీంనగర్, నల్లగొండలో భద్రపరుస్తామని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని సీఈవో వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై 6 ఫిర్యాదులు వచ్చాయని, డబ్బులు పంపిణీ జరిగినట్టు ఎలాం టి ఫిర్యాదులు రాలేదన్నారు. 

పెరిగిన ఓటింగ్.. లాభం ఎవరికి? 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగానే పెరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వరకే పరిమితమైంది. బీజేపీ మూడు ఎమ్మెల్సీల స్థానాలకు పోటీ చేసింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం గా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు స్వతంత్రులు కూడా పోటీ చేశారు. టీచర్ స్థానాల్లో ఆయా ఉపాధ్యాయ సంఘాల నుంచి పోటీకి దిగారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కాంగ్రెస్ టికెట్ ఆశించిన భంగపడ్డ ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్టు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎవ రూ గెలిచే అవకాశం లేదని, రెండు లేదా మూడో ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచే అవకాశాలు ఆధారపడి ఉన్నట్లు చర్చ జరుగుతోం ది.

బీఆర్‌ఎస్ సానుభూతిపరులు ఎవరికి మద్దతుగా నిలిచారనే విషయంలో సస్పెన్షన్ నెలకొంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మాత్రం బీసీ అభ్యర్థులకు మద్దతుగా ఉంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయి తే పెరిగిన ఓటింగ్ ఎవరి విజయానికి దోహదపడుతుందో.. మరెవరి ఓటమికి కారణం కాబోతున్నదనే రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విజయంపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీ తమకు కలిసి వస్తుందని, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని హస్తగతం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ఇక ప్రభు త్వ వ్యతిరేక ఓటు తమను గెలిపిస్తుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.