calender_icon.png 14 November, 2024 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిగిన నిరుద్యోగం

13-11-2024 01:46:35 AM

  1. దేశవ్యాప్తంగా 7.8 శాతంగా నమోదు 
  2. దేశ సగటు కంటే తెలంగాణలోనే మెరుగు 
  3. రాష్ట్రంలో 4.4 శాతమే నిరుద్యోగ రేటు
  4. సంక్షోభాలు, ప్రభుత్వ నిర్ణయాలతోనే ఈ స్థితి
  5. సీఎంఐఈ నివేదిక వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): దేశ, రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి రంగం కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఉపాధి లభించకపోతే సమాజంలోని ఇతర రంగాల్లో సమన్వయం లోపిస్తుంది. తద్వారా ఆర్థి కాభివృద్ధి కుంటుపడు తుంది. ప్రస్తు తం దేశంలో నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా మారింది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశా ల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. దీంతోపాటు మన దేశంలో ఉన్న యువ జనా భా ప్రపంచంలోని మరే దేశంలోనూ లేదు. ఇది ఒక రకంగా మంచి పరిణామ మే అయి నా.. నిరుద్యోగ సమస్య మాత్రం యువతను ఇబ్బందులకు గురిచేస్తుంది.

దేశంలో ఏటా పెరుగుతున్న నిరుద్యోగం ఆందోళనకు గురిచేస్తుం ది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికతో ఈ విషయం స్పష్టమవుతుంది. 

నిరుద్యోగ రేటు 7.8 శాతం 

దేశంలో నిరుద్యోగుల రేటు తెలుసుకునేందుకు సీఎంఐఈ సంస్థ సర్వే చేపట్టింది. పదిహేను ఏళ్లకు సంబం ధించిన గణాంకాలు సేకరించింది. 2008 నుంచి 2024 వరకు దేశంలో నిరుద్యోగుల శాతం పెరిగిన తీరును వివరించింది. 2008లో 5.41 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు 2019 వరకు పెద్దగా పెరిగిందేమీ లేదు. 2019 వరకు 5.27 శాతంగా ఉన్న నిరుద్యోగరేటు 2020లో ఏక ంగా 8 శాతానికి పెరిగింది.

2021లో మళ్లీ తగ్గినప్పటికీ అలాగే కొనసాగలేదు. 2022లో 7.33 శాతం, 2023లో 8.003 శాతంగా నమోదైంది. 2024లో మళ్లీ కాస్త తగ్గింది. ప్రస్తుతం దేశంలో 7.8 శాతంగా ఉంది. దేశంలో చోటు చేసుకున్న అనేక నిర్ణయాత్మక పరిణామాలు కారణంగా నిరుద్యోగ రేటులో హెచ్చు తగ్గులు నమోదయ్యాయి. 

తెలంగాణలోనే మెరుగు 

నిరుద్యోగ రేటు విషయంలో దేశ సగటు తో పోల్చుకుంటే తెలంగాణ మెరుగుదల కనబరుస్తుంది. దేశంలో 7.8 శాతం ఉంటే, తెలంగాణలో 4.4 శాతంగా నమోదైంది. రాష్ట్రాల వారీగా వెల్లడించిన జాబితాలో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. అయి తే, లక్షద్వీప్, గోవా, అండమాన్ మాత్రం దేశ సగటు కంటే అధికంగా నిరుద్యోగ రేటు ఉన్నట్టు నివేదికలో వెల్లడైం ది.

లక్షద్వీప్‌లో 11.1 శాతం, గోవాలో 9.7 శాతం, అండమాన్‌నికోబార్‌లో 9.7 శాతంతో నిరుద్యోగ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మొదటి మూడు స్థానా ల్లో నిలిచాయి. 2 శాతం కంటే తక్కువ నిరుద్యోగ రేటుతో ఢిల్లీ, అస్సాం, గుజరాత్, జార్ఘండ్, మధ్యప్రదేశ్, త్రిపుర చివరి ఆరు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్త నిరుద్యోగ రేటు కంటే తెలంగాణలో తక్కువగానే ఉన్నప్పటికీ, ఇంకా చాలా రాష్ట్రాలు మాత్రం తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్నాయి. 

ప్రభావితం చేసిన అంశాలు ఇవే..

* 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ పరిస్థితి అభివృద్ధికి ఆటంకంగా మారడంతోపాటు పలు రంగాల్లో ఉపాధి అవకాశాలను తగ్గించింది. 

* 2016లో డీమానిటైజేషన్ ద్వారా పెద్ద నోట్లను రద్దు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేక ఇబ్బందులకు దారి తీసింది. అసంఘటిత రంగాల్లో, తాత్కాలిక ఉద్యోగాలు కోల్పొవడానికి కారణమైంది. 

* పన్నుల అంశాన్ని సరళీకృతం చేయడంలో భాగంగా 2017లో తెచ్చిన జీఎస్టీతో ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థలో అంతరాయాలను కలిగించి, వ్యాపారాలు, ఉపాధిని ప్రభావితం చేసింది. 

* 2019లో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కొవిడ్ మహమ్మారి, ఆ తర్వాత లాక్‌డౌన్ చర్యలు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా వ్యాపారాలు మూసివేయడం, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం నిరుద్యోగం పెరిగింది.