19-04-2025 12:05:23 AM
ఉస్మానియా ఆస్పత్రి వైద్యులకు సీఎం అభినందన
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18(విజయక్రాంతి): ఉస్మానియా ఆస్పత్రి వైద్యులను సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం తన ఎక్స్ ఖాతా ద్వారా అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడికి కాలేయ మార్పిడి చేసిన డా.రంగా అజ్మీరా, డా.విక్రమ్ వైద్య బృందాల సేవలను కొనియాడారు. ‘నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు’ అన్న నానుడిని తిరగ రాశారని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని రుజువు చేశారని కితాబిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవ చేస్తున్న ప్రతీ వైద్యుడు, సిబ్బంది ఆదర్శంగా నిలవాలని సూచించారు.