calender_icon.png 26 December, 2024 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి ఎమ్మెల్యేకు పెరిగిన భద్రత

08-11-2024 12:08:38 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఇటీవల మావోయిస్టుల నుండి హెచ్చరికలు జారీ కావడంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ప్రభుత్వం భారీ భద్రతను కేటాయించింది. ఎమ్మెల్యే వినోద్ కలిసి ఎందుకు వచ్చే ప్రజలను క్యాంపు కార్యాలయం ప్రవేశద్వారం వద్ద పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి పోలీస్ సిబ్బంది అనుమతిస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు భూకబ్జాలతో పాటు రౌడీయిజానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో మావోయిస్టులు లేక విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల నుండి ఎమ్మెల్యే వినోద్ కు 18 మందితో కూడిన స్పెషల్ సెక్యూరిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఆయన అధికారిక కార్యక్రమాల్లో ఇద్దరు ఎస్ఐలు, 6 గురు స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది, ఇద్దరు బాంబు డిస్పోజల్ సిబ్బంది, 6 గురు గన్మెన్లు, ఇద్దరు క్యాంపు గార్డులతో పాటు బయటకు వెళ్లే సమయంలో స్థానిక సీఐ, ఎస్సై స్థాయి అధికారులను రక్షణ కేటాయించింది. ఎమ్మెల్యే పర్యటనలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ నిత్యం ఆయనతోనే ఉంటూ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఎమ్మెల్యే వినోద్ కు కల్పించిన ప్రత్యేక భద్రత ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.