- గడిచిన ఆరు నెలల్లో 21 శాతం రియల్ వృద్ధి
- దేశంలోని ప్రధాన నగరాల్లోనూ పెరిగిన విక్రయాలు
- నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడి
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 6 (విజయక్రాంతి): హైదరాబాద్ రియల్ మార్కెట్ జోరందుకుంది. 2024 తొలి అర్ధభాగం (జనవరి ఇళ్ల క్రయవిక్రయాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇళ్ల అమ్మకాలు 21 శాతం వృద్ధితో 18,573 యూనిట్లకు చేరినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా వెల్లడించిన నివేదికలో తెలిపింది. అలాగే ఆఫీస్ వసతులకు 71 శాతం డిమాండ్ పెరిగి 5 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్టు నివేదికలో పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు గడిచిన ఆరు నెలల కాలంలో 11 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. అలాగే దేశంలో ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 1.73 లక్షల యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి.
నగరాలవారీగా పరిశీలిస్తే..
దేశంలోని ప్రధాన నగరాలవారీగా పరిశీలిస్తే ముంబైలో ఈ ఏడాది జనవరి- మధ్య కాలంలో 47,259 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చిచూస్తే ఇది 16 శాతం అధికం. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఇళ్ల అమ్మకాలు 4 శాతం పెరిగి 28,998 యూనిట్లు అమ్ముడయ్యాయి. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 4 శాతం వృద్ధితో 27,404 యూనిట్లకు చేరాయి. పుణెలో 13 శాతం పెరుగుదలతో 24,525 ఇళ్లు అమ్ముడయ్యాయి. చెన్నులో 12 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 7,975 యూనిట్లుగా ఉన్నాయి. కోల్‌కతాలో 9,130 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే 25 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల అమ్మకాలు 17 శాతం వృద్ధితో 9,377 యూనిట్లకు చేరాయి.
స్థిరమైన ఆర్థిక పరిస్థితులు
భారత దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్ని త్రైమాసికాల్లో బలంగా ఉండటంతోపాటు బలమైన ఆర్థిక మూలాలను, స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తోందని నైటాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ జైజాల్ పేర్కొన్నారు. దీని ఫలితంగానే ఇళ్ల అమ్మకాలు, కార్యాలయ వసతుల లీజింగ్ దశాబ్ద గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని వెల్లడించారు. 2024 తొలి ఆరు నెలల్లో మొత్తం అమ్మకాల్లో 34 శాతం ఖరీదైన ఇళ్లే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.