calender_icon.png 23 October, 2024 | 6:01 PM

పెరిగిన పారిశ్రామికోత్పత్తి

13-07-2024 12:24:53 AM

మే నెలలో 5.9 శాతం

న్యూఢిల్లీ, జూలై 12: మైనింగ్, విద్యుత్ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించడంతో దేశంలో పారిశ్రామికోత్పత్తి ఈ ఏడాది మే నెలలో 5.9 శాతం వృద్దిచెందింది. ఫ్యాక్టరీల ఉత్పత్తిని కొలిచే పరిశ్రమల ఉత్పత్తి సూచి (ఐఐపీ) 2023 మే నెలలో 5.7 శాతం పెరగ్గా, ఈ ఏడాది ఆ వృద్ధి 5.9 శాతమని శుక్రవారం కేంద్ర గణాంకాల శాఖ తెలిపింది. 2024 మే నెలలో మైనింగ్ ఉత్పత్తి 6.6 శాతం పెరగ్గా, విద్యుదుత్పత్తి 13.7 శాతం వృద్ధిచెందింది. అయితే తయారీ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 4.6 శాతానికి పరిమితమయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలల్లో ఐఐపీ 5.4 శాతం వృద్ధిచెందింది. నిరుడు ఇదేకాలంలో ఈ వృద్ధి 5.1 శాతం.