calender_icon.png 8 January, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిగిన జీఎస్టీ రిజిస్ట్రేషన్స్

05-01-2025 01:50:06 AM

  • 9 నెలల్లో 46 వేలు కొత్తగా నమోదు
  • సెంట్రల్ విభాగంలో 22,733 మంది..
  • రాష్ట్రంలో కొత్తగా 23,556 మంది వియోగదారులు
  • జాతీయ సగటు కూడా తక్కువగానే నమోదు
  • జీఎస్టీ వసూళ్లలో ౯వ స్థానంలో తెలంగాణ

  • హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాం తి): తెలంగాణలో గతేడాది ఏప్రిల్ మధ్య కాలంలో జీఎస్టీ వినియోదారు లు పెరిగారు. మూడు త్రైమాసికాల్లో కలిపి 46,289 మంది కొత్తగా రిజిస్టర్ చేసుకున్నట్టు జీఎస్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో కొందరు స్టేట్ పరిధిలో, మరికొందరు సెం ట్రల్ పరిధిలో రిజిస్టర్ చేయించుకున్నారు.

  • కొత్త రిజిస్ట్రేషన్స్‌లో తెలంగాణలో సెంట్రల్, స్టేట్ జీఎస్టీ కలిపి సగటు వృద్ధి 5.5 శాతం కాగా.. జాతీయ వృద్ధి 10.1శాతం కావడం గమనార్హం. దాదాపు ఐదు శాతం తగ్గింది. స్టేట్, సెంట్రల్ విభాగాలను విడివిడిగా పరిశీలిస్తే.. ఇందులో కేంద్ర రిజిస్ట్రేషన్స్ పెరి గాయి.

  • కేంద్ర జీఎస్టీలో తొమ్మిది నెలల్లో 22,733 మంది పెరిగారు. ఇదే సమయంలో రాష్ట్రంలో 23,556 మంది వినియోదారులు కొత్తగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్స్ వృద్ధి 3.6 శాతం కాగా.. సెంట్రల్‌లో 7.5 శాతం నమోదైంది. అంటే కేంద్ర జీఎస్టీలో 3.9 శాతం ఎక్కువ మంది చేయించుకున్నారు.  

డిసెంబర్‌లో రూ.5,224 కోట్ల జీఎస్టీ వసూలు

గత డిసెంబర్‌లో రాష్ట్రంలో రూ.5,224 కోట్ల జీఎస్టీ వసూలైంది. 2023 డిసెంబర్ నెలలో రూ.4,753 కోట్లు వసూలు కాగా.. గత నెలలో 10 శాతం ఎక్కువ వచ్చాయి. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్ బర్ నాటికి తొమ్మిది నెలల్లో రూ.32,653 కోట్ల రాబడి రాగా.. గతేడాది రూ.29,889 కోట్ల జీఎస్టీ మాత్రమే వసూలైంది. డిసెంబర్‌లో అత్యధికంగా జీఎస్టీ వసూలైన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో రూ.29,260 కోట్లతో మహారాష్ట్ర ఉండగా తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది.

అలాగే, ఏప్రిల్ మధ్యకాలంలో ఎక్కువ మొత్తంలో జీఎస్టీ వచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ ఏడో స్థానంలో ఉండగా..  రూ.1,26,267 కోట్లతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది.

తొమ్మిది నెలల కాలంలో తెలంగాణలో 9 శాతం వృద్ధి నమోదు కాగా.. మహారాష్ట్రలో మాత్రం ఏకంగా 16 శాతం ఎక్కువ జీఎస్టీ వసులైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. అలాగే, పొ రుగున ఏపీలో డిసెంబర్‌లో రూ.3,315 కోట్లు మాత్రమే జీఎస్టీ వచ్చింది. ఇది గతేడాది కంటే 6 శాతం తక్కువ. ఏప్రిల్  డి సెంబర్‌లో ఏపీకి రూ.24,505 కోట్లు జీఎస్టీ వచ్చింది. అయితే తొమ్మిది నెలల వసూళ్లలో మాత్రం 4 శాతం వృద్ధి నమోదైంది.

సెంట్రల్ జీఎస్టీ వివరాలు ఇలా

మొత్తం వినియోదారులు 2,26,777 

ఏప్రిల్ మధ్య రిజిస్ట్రేషన్స్ 22,733

పెరిగిన శాతం 7.5శాతం

స్టేట్ జీఎస్టీ వివరాలు

మొత్తం వినియోదారులు 3,09,721  

ఏప్రిల్ మధ్య రిజిస్ట్రేషన్స్ 23,556 

పెరిగిన శాతం 3.6 శాతం