calender_icon.png 18 April, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి

10-04-2025 12:31:08 AM

సీపీఎం రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యుడు డీ కిషన్ 

అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 9 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని - సీపీఎం రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు డీ కిషన్  డిమాండ్ చేశారు. బుధవారం  తుర్కయంజాల్ మున్సిపల్ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నాగార్జునసాగర్ రహదారిపై వంట గ్యాస్ సిలిండర్ తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు డి.కిషన్ మాట్లాడుతూ..

అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు 2024 నుంచి క్రమంగా తగ్గుతూ  ఇటీవలి కాలంలో అవి మరింత తగ్గాయి.. కానీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్ పై 50 రూపాయలను  పెంచడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. పెరిగే గ్యాస్ ధరల ప్రభావం మిగతా నిత్యవసర వస్తువుల ధరలపై కూడా పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రజలకు ఉపాధి లేక ఆదాయం లేక నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతూ వారి కొనుగోలు క్షీణిస్తుందని ఈ క్రమంలో ఇలా ధరలు పెంచు కుంటూ పోతే ప్రజల జీవనం ఎలా సాగుతుందని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుదారులకు లక్షల కోట్ల రూపాయలు  రుణాలు రాయితీలుగా ఇచ్చి ఆ భా రాన్ని పేద ప్రజలపై మోపుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతి రేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలన్నారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ  నాయకులు మండల సత్యనారాయణ, ఇల్లూరి భాస్కర్, బడుగు మాల్యాద్రి, నాయకులు ఎన్ యాదగిరి, గనిపల్లి రాములు, మద్దెల యాదయ్య, జక్క హనుమంత్ రెడ్డి, గుండా బాలరాజ్, బండ బీరప్ప, మధుకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, యాదగిరి, శ్రీనివాస్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.