calender_icon.png 20 April, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలి

09-04-2025 01:28:30 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి

చేర్యాల ఏప్రిల్ 8: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని పేదల మీద భారం మోపే పద్ధతిని మానుకోవాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులతో కుటుంబాలు పోషించుకోలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పైన 50 రూపాయలు పెంచడం దుర్మార్గమైన చర్య అని పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకొని పేదలపై బారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

మరో ప్రక్క రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంట గ్యాస్ పై సబ్సిడీ నీ అన్ని కుటుంబాలకు వర్తింపచేయడం లేదని సబ్సిడీని పేదలందరికీ వర్తించే విధంగా చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పేదలపై భారాలు మోపే ప్రజా వ్యతిరేక విధానాల పై సిపిఎం పార్టీ నిర్వహించే పోరాటాల్లో ప్రజలంతా కలిసి రావాలని సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట మావో, చేర్యాల, కొమరవెల్లి మండల కార్యదర్శి బండ కింది అరుణ్ కుమార్, తాడూరి రవీందర్, ముస్త్యాల ప్రభాకర్, రేపాక కుమార్, బోయిని మల్లేశం, స్వర్గం శ్రీకాంత్, దాసరి బాలస్వామి, యాడారం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.