calender_icon.png 25 December, 2024 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జున సాగర్‌కు పెరిగిన వరద

19-10-2024 02:26:02 AM

నల్లగొండ, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ప్రవాహం భారీగా పెరిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదిలో వరద ఉద్ధృతి  పెరిగింది. రిజర్వాయర్‌కు ఎగువ నుంచి 1,05,777 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి స్పిల్ వే ద్వారా 64,720 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు.

సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.90 అడుగులు (311.7462 టీఎంసీలు)గా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ 29,313 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కుడి కాల్వకు 3,371, ఎడమ కాల్వకు 6,173, ఎస్సెల్బీసీ (ఏఎమ్మార్పీకి) 1,800, లోలెవల్ కాల్వకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు.