calender_icon.png 25 October, 2024 | 12:03 PM

ఆఫీస్ స్పేస్‌కు పెరిగిన డిమాండ్

04-07-2024 01:33:56 AM

న్యూఢిల్లీ, జూలై 3: ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ జోరుగా పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పూణే నగరాల్లో ప్రస్తుత ఏడాది ప్రధమార్థంలో కార్యాలయాల ఏర్పాటుకు 33.54 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగిందని వెల్లడించింది. నిరుడు ఇదేకాలంతో (26.01 మిలియన్ చదరపు అడుగులు) పోలిస్తే ఇది 29 శాతం అధికమని పేర్కొంది.

కొవిడ్ పాండమిక్‌కు ముందు 2019 ప్రధమార్థంలో నెలకొల్పిన రికార్డును తాజా సంవత్సరంలో మించినట్టు జేఎల్‌ఎల్ తెలిపింది. 2019 జనవరి మధ్యలో 30.71 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ స్థూలంగా లీజింగ్ జరిగింది.  2024లో రికార్డుస్థాయిలో 6,570 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదవుతుందని, ఇది దేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లో మైలురాయిగా నిలుస్తుందని జేఎల్‌ఎల్ అంచనా వేసింది.