calender_icon.png 29 December, 2024 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంలో పెరిగిన క్రైమ్ రేట్

29-12-2024 01:53:40 AM

* 2024లో 8,873 కేసులు నమోదు 

* ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్  

ఖమ్మం, డిసెంబర్ 28 (విజయక్రాంతి): గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 16 శాతం క్రైమ్ రేట్ పెరిగింది. శనివారం ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో సీపీ సునీల్‌దత్ 2024లో నమోదైన వివిధ కేసుల వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. నిరంతర నిఘా ఫలితంగా ఈ ఏడాది మేజర్ క్రైమ్ నమోదు కాలేదని అన్నారు. 

బాధితులు 100కు డైల్ చేసిన వెంటనే పోలీసులు స్పందించి, పరిష్కరించడం వల్ల కేసులు ఎక్కువగా పెరగలేదని చెప్పారు. నమోదైన కేసుల్లో 99.44 శాతం పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. జిల్లాకు వీఐపీల ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ పోలీసులు కేసుల పరిష్కారంలో చేసిన కృషి ఎంతో అభినందనీయమన్నారు. జిల్లావ్యాప్తంగా గతేడాది 7,667 కేసులు నమోదైతే 2024లో 8,873 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సమావేశంలో అడిషనల్ డీసీసీ నరేశ్‌కుమార్, అడిషనల్  డీసీపీ (లా అండ్ ఆర్డర్) ప్రసాదరావు, ట్రైనీ ఐపీఎస్ రుత్విక్ తదితరులు పాల్గొన్నారు.