calender_icon.png 30 October, 2024 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిగిన బ్రెయిన్ అటాక్ కేసులు

30-10-2024 12:04:39 AM

  1. నాసా ఆసుపత్రి వైద్యుడు నవీన్ కుమార్
  2. ఎల్బీనగర్‌లో బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన ర్యాలీ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ‘వరల్డ్ స్ట్రోక్ డే’ సందర్బంగా ఎల్బీనగర్‌లోని నాసా ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. చింతల్‌కుంటలోని నాసా ఆసుపత్రి నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో సీనియర్ సిటిజన్స్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాసా ఆసుపత్రి డాక్టర్ నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. మెదడుకు వచ్చే పక్షవాతం కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత హార్ట్ ఎటాక్‌తో పాటు బ్రెయిన్ ఎటాక్ కేసులు కూడా పెరిగాయన్నారు.

ఈ వ్యాధులు గతంలో 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేవని.. ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల వారికి కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటుతో పాటు వారసత్వంగానూ అలాగే ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం  ఉందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ర్యాలీ నిర్వహించామని తెలిపారు.