calender_icon.png 25 October, 2024 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్‌పోస్టులపై నిఘా పెంచండి

05-05-2024 01:00:55 AM

ఎన్నికల వ్యయ పరిశీలకుడు సయాన్ దేబర్మ

జనగామ, మే 4 (విజయక్రాంతి):  పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, డబ్బు సరఫరాను నియంత్రించేందుకు అన్ని చెక్‌పోస్టుల వద్ద నిఘా పెం చాలని భువనగిరి పార్లమెంటు ఎన్నికల వ్య య పరిశీలకుడు సయాన్ దేబర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జన గామ కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ పింకేశ్‌కుమార్, డీసీపీ సీతారాంతో కలిసి ఎన్నికల విధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, స్టాటిక్ సర్వైలైన్స్, వీడియో సర్వైలైన్స్ బృందాలు పకడ్బందీగా పనిచేయాలని తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లోని సమీకృత కంట్రోల్ రూంను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్ర మంలో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జెడ్పీ సీఈవో అనిల్‌కుమార్, నోడల్ అధికారులు మొగులప్ప, రాజేందర్, వినోద్ కుమార్, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.