calender_icon.png 18 November, 2024 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్లీపర్ కోచ్‌లు పెంచండి!

02-07-2024 12:05:00 AM

మన దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ ‘భారతీయ రైల్వే’. రైళ్ళలో అధికంగా సాధారణ ప్రజలే ప్రయాణిస్తుంటారు. గత సంవత్సరం 95 శాతం మందికి పైగా ప్రజలు నాన్ ఏ.సి.రైళ్ళలోనే ప్రయాణించారు. సాధారణ బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిసి పోతుంటారు. ఈ పరిస్థితులలో భారతీయ రైల్వే అధిక ఏ.సి. త్రీటయర్ కోచ్‌లుసహా కేవలం కొన్ని (జనరల్) స్లీపర్ కోచ్‌ల తయారీకి మాత్రమే ప్రణాళికలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదెంతో విడ్డూరం. నాన్ ఏ.సి. కోచ్‌లకంటే ఏ.సి.కోచ్‌ల ధరలు దాదాపు రెండురెట్లు ఎక్కువ. ధనిక ప్రయాణీకులనే ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు చేయడం భావ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం సాధారణ, పేద ప్రజలను కూడా పట్టించుకొని జనరల్ కంపార్ట్‌మెంట్ పెట్టెల తయారీ సంఖ్యను కూడా పెంచాలి. 

 -కప్పగంతు వెంకటరమణమూర్తి, సికింద్రాబాద్