calender_icon.png 23 October, 2024 | 3:11 AM

విత్తనోత్పత్తి పెంచాలి

04-08-2024 03:37:23 AM

టెక్నాలజీ కోసం రైతులు ప్రభుత్వంపై ఆధారపడొద్దు  

అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల పిలుపు 

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో వరితోపాటు మిగతా పంటల విత్త నాల ఉత్పత్తిని పెంచాలని, కొత్త ఆలోచనలతో ముందుకురావాలని అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులు ప్రభుత్వం మీద ఆధారపడకుండా టెక్నాలజీని వినియోగించుకొనేలా చూడాలని చెప్పారు. శనివారం సచివాలయంలో వ్యవసాయ కోఆపరేటివ్, మార్కెటిం గ్, జౌళీ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా మాట్లాడు తూ.. రైతాంగానికి మేలు జరుగుతుందనే భావ న కొన్ని కార్పొరేషన్లు కల్పించి, బలోపేతం చేయాలని అన్నారు. మన గోదాములు ఖాళీ గా ఉండి, ప్రైవేటు గోదాములు నిండుగా ఉం టే లోపం ఎక్కడుందో గమనించాలని చెప్పా రు. వివిధ సంస్థల అధీనంలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ పరిరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఖమ్మం మార్కెట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్‌చేసి, దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేలా ప్లాన్ రూపొ ందించాలని అధికారులను ఆదేశించారు. 

నలుగురు విద్యార్థులకు ఫెలోషిప్  

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి ప్రతిభావంతులైన నలుగురు విద్యార్థుల ను వ్యవసాయ శాఖ తరఫున ఎంపిక చేశారు. మాస్టర్స్ పూర్తయ్యేవరకు అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ వర్సిటీల నుంచి మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు, అబురన్ యూనివర్శిటీ, అల్బమా స్టేట్ అమెరికాలో మాస్టర్స్ చేసేలా ఒక్కో వర్సిటీ నుంచి బ్యాచ్‌కు ఇద్దరు చొప్పన నలుగురిని ఈ ఫెలోషిప్‌కు ఎంపిక చేయగా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శనివారం మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో విద్యార్థికి రెండేళ్లకు రూ.55 లక్షల చొప్పున రూ.2.22 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులు ప్రవళిక, పావని, ఐశ్వర్య, నిధాబేగంను అభినందించారు.