12-02-2025 08:09:57 PM
ఎమ్మెల్యే పాయల్ శంకర్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో ప్రస్తుతం ఉన్న కందుల కొనుగోళ్ల పరిమితిని పెంచాలనే వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రస్తుతం ఉన్న 3.35 క్వింటాళ్ల పరిమితిని 8 క్వింటాలకు పెంచుతూ రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తుందని అన్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. జొన్నల విషయంలోను మంత్రితో చర్చించామని ఎకరానికి 20 కింటలకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున పరిమితిని పెంచుతూ ముందే ఉత్తర్వులు ఇవ్వాలని ఆయనను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులు తక్కువ ధరతో దూర ప్రాంతాలకు వెళ్లి పంటలను అమ్ముకోవాల్సిన అవసరం లేదని స్థానిక మార్కెట్లోనే మద్దతు ధరతో విక్రయించుకోవాలని ఆయన సూచించారు.