calender_icon.png 26 October, 2024 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీలో అర్చకులకు గౌరవ వేతనం పెంపు

28-08-2024 12:51:48 AM

మీక్షలో సీఎం చంద్రబాబు 

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఏపీలోని దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. రూ.10 వేల వేతనం ఇచ్చే అర్చకులకు ఇకపై రూ.15 వేలు, దూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ.5 వేలను రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించారు. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3 వేల భృతి ఇవ్వాలని నిర్ణయించారు. ఆలయాల్లో నాయీబ్రాహ్మణులకు కనీస వేతనం 25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీజీఎఫ్ కింద, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో జరిగే పనుల్లో ప్రా రంభంకాని పనులు నిలిపేయాలని ఆదేశించారు. ఆధ్యాత్మిక పర్యాటకం ప్రమోషన్ కోసం మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా ఇద్దరికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు.