calender_icon.png 20 March, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల పెంపు హర్షణీయం

20-03-2025 12:36:06 AM

రేవంత్‌ను సన్మానించిన బీసీ ఉద్యోగుల సంఘం

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంపు బిల్లును అసెంబ్లీలో ఆమోదించడంపై రాష్ర్ట బీసీ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు యం.చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం బీసీ ఉద్యోగుల సంఘం రూపొందించిన 2025 డైరీని సీఎం రేవంత్ ఆవిష్కరించారు.

మంత్రులు ఉత్తమ్ కుమార్, పొన్నం ప్రభాకర్, పొంగులేటి, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్, సీనియర్ నేత వీ హనుమంతరావు, బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రమాదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ రామరాజు వర్మ, సుంకరి శ్రీనివాస్ తదితరులున్నారు. 

బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు

గతేడాదితో పోలిస్తే 2,205 కోట్లు పెరుగుదల

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు స్వల్పంగా మాత్రమే పెరిగాయి. బడ్జెట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ.11, 405 కోట్లు మాత్రమే కేటాయించింది. అయితే గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపుల శాతం స్వల్పంగా పెరిగింది.

2024-25 బడ్జెట్‌లో బీసీ సంక్షేమశాఖకు రూ. 9200 కోట్లు కేటాయించగా.. ఈసారి 0.58 శాతం మేర అంటే కేవలం రూ. 2,205 కోట్లు మాత్రమే పెరగడం గమనార్హం. గతేడాది బడ్జెట్‌లో బీసీలకు 3.15 శాతం నిధులు కేటాయిస్తే.. ఈసారి 3.73 శాతం కేటాయించారు.