12-03-2025 12:13:09 AM
రాష్ట్ర బీసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు రాచాల యుగేందర్ గౌడ్
పెబ్బేరు, మార్చి 11: గత ప్రభుత్వ హయంలో నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ పాఠశాలల నిర్మాణాలు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి భవనాలు పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ పొలిటికల్ జెఎసి అధ్యక్షులు రాచాల యుగంధర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
గ్రామాలు, పట్టణాల్లో సమస్యలను తెలుసుకొనేందుకు చేపట్టిన మార్నింగ్ వాక్ తలపెట్టారు. అందులో భాగంగా మంగళవారం పెబ్బేరు మున్సిపాలిటీలోని 5, 6 వార్డులలో నెలకొన్న ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా కిష్టారెడ్డిపేట వేణుగోపాల స్వామి అలయం, చెలిమిల్లలోని ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం కిష్టారెడ్డిపేటలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఒకే గదిలో 101 మంది విద్యార్థులకు బోధిస్తుండటంపై విచార వ్యక్తం చేశారు.
పాఠశాల భవనాలకు చెందిన బిల్లులు రాక మధ్యలోనే ఆగడంతో తప్పని పరిస్థితుల్లో అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి బోధిస్తున్నామని ఉపాధ్యాయులు అయన దృష్టికి తీసుకువెళ్లారు. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. చెల్లిమిల్ల ప్రైమరీ స్కూల్ ప్రేయర్ సమయంలో విజిట్ చేయగా అక్కడ ఇద్దరు టీచర్లు హాజరుకాకపోవడంపై ఆరా తీయగా హెచ్‌ఎం కింది స్థాయి టీచర్లను కాపాడే విధంగా సమాధానం చెప్పారని మండిపడ్డారు.
6 వ వార్డులోని గాంధీ నగర్ కాలనీలో సీసీ రోడ్లు వేయడం సంతోషించాల్సిన విషయమే అయినా డ్రైనేజీ లేక పోవడంతో వర్షాకాలం నీళ్లన్నీ ఇళ్లముందు ఆగి ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అసంపూర్తి చేపట్టిందని పేర్కొన్నారు. చెలిమిళ్లలో 6కల్లు గీత లైసెన్స్ లున్న గౌడ కులస్థులు మిగతా వారిని కల్లు అమ్మనివ్వడంలేదని దీని శాశ్వత పరిష్కానికి కృషి చేయాలని కోరారు. చెలిమిల్ల కల్లు మాముల పంచాయతీలో రాష్ట్ర కేబినెట్ పదవిలో ఉన్న నేత జోక్యంతో పరిష్కారం కానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నం. 455, 456 లలో కొందరు బీసీలు ప్లాట్లు కొని హద్దు రాళ్లు పాతుకుంటే పెబ్బేరు పట్ణణానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించి పోలీసులచే యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. సమస్యను రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామన్ గౌడ్, మాజీ సర్పంచ్ అక్కి శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ రాచాలను శాలువాతో ఘనంగా సన్మానించిన సర్వాయి పాపన్న చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్, నాయకులు రాఘవేందర్ గౌడ్, నరసింహ యాదవ్, అంజన్న యాదవ్, మహిందర్ నాయుడు, దేవర శివ, నాగరాజు యాదవ్, నాగరాజు, సురేందర్, రాజు, రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.