calender_icon.png 29 April, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్తికాని ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

29-04-2025 01:11:28 AM

సూర్యాపేట, ఏప్రిల్ 28: ప్రజలు నుండి స్వీకరించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు అర్హత మేర పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి రాంబాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అత్యధికంగా భూ సమస్యల పై, హౌజింగ్ లపై దరఖాస్తులు వచ్చాయన్నారు.

తాసిల్దార్లు వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. భూ సమస్యల పై 32, హౌజింగ్ 10, మున్సిపాలిటీ 6, డి ఆర్ డి ఏ 4, డి డబ్ల్యు ఓ 3 ఇతర శాఖలకు సంబంధించినవి 25 మొత్తం 80 దరఖాస్తులు వచ్చాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, కలెక్టరేట్ ఎలక్షన్ సూపరిండెంట్ శ్రీనివాసరాజు, డీఎస్‌ఓ రాజేశ్వరరావు, డి ఏం హెచ్ ఓ  కోటాచలం, డీబ్ల్యూఓ నరసింహారావు, ఎస్ సి కార్పొరేషన్ సంక్షేమ అధికారి లత, ఎల్డియం  బాపూజీ, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, సీపీఓ కిషన్ లు పాల్గొన్నారు.