01-04-2025 12:22:46 AM
కొన్నిచోట్ల అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్
నిధులు విడుదలకాక నిలిచిపోయిన నిర్మాణాలు
కామారెడ్డి జిల్లాలో మినీ స్టేడియాల నిర్మాణాల పరిస్థితి ఇది
కామారెడ్డి, మార్చి 31 (విజయ క్రాంతి), గ్రామీణ స్థాయి క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని సదుద్దేశంతో గత మూలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఉమ్మడి కామారెడ్డి జిల్లాలోని 25 మండలాలకు మినీ స్టేడియాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. మండలానికి ఒక మినీ స్టేడియాన్ని నిర్మించాలని ఉద్దేశంతో అప్పటి వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాలను సేకరించింది. ఒక్కో మినీ స్టేడియం నిర్మాణానికి రెండు కోట్ల 65 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది.
కొన్నిచోట్ల స్థలాలను కొనుగోలు చేయగా మరికొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలను అప్పట్లో గుర్తించి మినీ స్టేడియాల ను ఉమ్మడి జిల్లాలోని మండల కేంద్రాల్లో నిర్మించాలని తల పెట్టారు. మినీ స్టేడియాల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాలను లెవలింగ్ చేసి నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పనులను అప్పగించారు. గ్రామీణ స్థాయి క్రీడ కారులకు జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొ నే విధంగా తీర్చిదిద్ది అవకాశాలు కల్పించాలని అప్పటి ప్రభుత్వం భావించింది.
గ్రామీణ స్థాయి ప్రతిభ గల క్రీడాకారులకు మినీ స్టేడియాలు స్థానికంగా నిర్మాణాలు చేపడితే ఎంతో ఉపయోగపడతాయని గ్రామీణ క్రీడాకారులు భావించారు. అంతర్జాతీయ క్రీడాకారు లుగా తయారు చేయాలని ఉద్దేశం గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రతిభను గుర్తించి గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారు లు ఎదగాలనే సదుద్దేశంతో ప్రతి మండలానికి మినీ స్టేడియాలను అప్పటి ప్రభుత్వం మంజూరు చేశారు.
నిధులు కొన్ని మినీ స్టేడియాలకు మంజూరైన మరికొన్ని మండలాలకు నీ ధులు మంజూరు చేయడంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు కొందరు పట్టించుకోలేదు. ఒక సంవత్సరంలోనే మినీ స్టేడియాల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉండగా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఆప్పటి 25 మండల కేంద్రాల్లో మినీ స్టేడియాలు మంజూరు చేశారు. ప్రభుత్వాలు మారడంతే మినీ స్టేడియాల నిర్మాణాలను ఎక్కడికి అక్కడే పనులు నిలిచిపోయాయి.
తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో కొత్త మండ లాలు ఏర్పాటు చేశారు. కొత్త మండల కేంద్రాల్లో సైతం మండల కేంద్రాల్లో మినీ స్టేడియము భవనాలను నిర్మించాలని తలపెట్టారు. గత ప్రభుత్వంలో కేవలం ఒకటి మాత్రమే కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో పూర్తిస్థాయిలో నిర్మాణం జరిపారు. నిధులు లేక ఆటకెక్కిన మినీ స్టేడియాల నిర్మాణాలు కామారెడ్డి జిల్లాలోని కేవలం బాన్సువాడ మండల కేంద్రంలో మాత్రమే మినీ స్టేడియం నిర్మాణం పూర్తికాగా మిగతా మండలాల్లో కొన్నిచోట్ల పనులు ప్రారంభించి నిధులు లేక అర్ధాంతరంగా పనులను కాంట్రాక్టర్లు నిలిపివేశారు.
కొన్ని మండలాల్లో నిర్మాణాలు చేపట్టి అసంపూర్తి గా భవనాలు నిర్మించడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. మరి కొన్ని చోట్ల స్థలాల సేకరణకే పరిమితమయ్యాయి. నిధులు రాక కాంట్రాక్టర్లు పనులు జరపక అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అప్పటికే మళ్లీ ప్రభుత్వం మారడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కామారెడ్డి జిల్లాలోని మినీ స్టేడియాల నిర్మాణాల దుస్థితి నెలకొన్నాయి. క్రీడాకారులకు చిగురిస్తున్న ఆశలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గ్రామీణ క్రీడాకారులలో ఆశలు చిగురిస్తున్నాయి.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో మంజూరు చేసిన మినీ స్టేడియాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి గ్రామీణ స్థాయి క్రీడాకారులకు అందుబాటులో మినీ స్టేడియాల నిర్మాణాలు జరుగుతాయని జిల్లాలోని క్రీడాకారులలో ఆశలు చిగురిస్తున్నాయి. తమ గ్రామాలకు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా రాణిస్తారని సదుద్దేశంతో కొందరు గ్రామస్తులు ప్రభుత్వానికి ఐదేకరాల స్థలాలను కూడా అప్పగించారు. మరికొన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టేందుకు స్థలాలను సిద్ధం చేశారు. కొన్నిచోట్ల భవనాలు నిర్మాణాలు ప్రారంభించి ఆర్ధాంతరంగా కాంట్రాక్టర్లు నిలిపివేశారు.
అప్పటి ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలో మినీ స్టేడియం నిర్మించడానికి బడి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలికి తీసేందుకు వారి ప్రతిభను గుర్తించి గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని ఉద్దేశంతో అప్పటి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మినీ స్టేడియాలకు స్థలాలను కేటాయించి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. గ్రామీణ స్థాయి క్రీడాకారులు ప్రభుత్వ నిర్ణయంతో అప్పట్లో ఎంతో సంతోషించారు. ప్రభుత్వాలు మారడంతో మినీ స్టేడియాల నిర్మాణాల పనులు నిలిచిపోయాయి.
కామారెడ్డి జిల్లా దోమకొండలో మినీ స్టేడియం నిర్మాణానికి రెండు కోట్ల 65 లక్షల నిధులను మంజూరు చేయగా స్టేడియం నిర్మాణం పనులను అప్పట్లో ప్రారంభించారు. మినీ స్టేడియం నిర్మాణం అయితే గ్రామీణ క్రీడాకారులకు ఎంతో ఉపయోగంలో ఉంటుందని దోమకొండలో సూర్యం నిర్మాణానికి గ్రామ అందరు కలిసి 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగించారు. ఆ స్థలంలో కాంట్రాక్టర్ నిర్మాణం పనులను చేపట్టి కొన్ని గదులను నిర్మించి బిల్లులు రావడంలేదని నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో గ్రామీణ ప్రాంతములోని దోమకొండ మండల క్రీడాకారులకు శాపం గా మారింది. ఇప్పటికే దోమకొండలో గడికోట ట్రస్ట్ ఆధ్వర్యంలో విలువిద్య కరాటే పోటీల్లో శిక్షణ ఇచ్చి రాష్ట్ర జాతి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ఇక్కడ యువత రాని స్తున్నారు. మరిన్ని రంగాల్లో క్రీడాకారులుగా రాణించేందుకు వారి ప్రతిభను గుర్తించేందుకు మినీ స్టేడియాను నిర్మాణాలను చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసు కుంది.
కామారెడ్డి జిల్లాలోని దోమకొండ బిచ్కుంద స్టేడియాలను నిర్మించలేమని కాంట్రాక్టర్ చేతులే చేతులెత్తేయడంతో కొత్తగా టెండర్లను ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలను కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో అధికారులు విప్లవం కావడంతో మినీ స్టేడియం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో మినీ స్టేడియాల కోసం నిర్మించిన అసంపూర్తి భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి. కబ్జాఅవుతున్న మినీ స్టేడియం స్థలాలు కామారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో అర్ధాంతరంగా నిలిచిపోయిన మిన స్టేడియాల భవనాల స్థలాల ను కొందరు కబ్జా చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా దోమకొండ లో మినీ స్టేడియం స్థలాన్ని కొందరు అబ్జర్వ్ చేసి పంటలు పెడుతున్నారు. ప్రభుత్వం సేకరించిన స్థలం అధ్యపురాల్లో చిచ్చుకుంటుంది అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో కబ్జాల పాలవుతున్నాయి. మండలాల్లో గ్రామీణ స్థాయి విద్యార్థులు క్రీడాకారులు కబడ్డీ వాలీబాల్ విలువిద్య పోటీల్లో రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయిలో, సత్తా చాటు తున్నారు. మినీ స్టేడియాల భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలి అబ్రబోయిన నీహంత్. క్రీడాకారుడు, దోమకొండ, కామారెడ్డి జిల్లా గ్రామీణ స్థాయి క్రీడ కారులకు భవిష్యత్తు కల్పించాలని లక్ష్యంతో అప్పటి వైఎస్‌ఆర్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండలానికి మినీ స్టేడియాల ను నిర్మించేందుకు నిధులను మంజూరు చేసింది.
ప్రభుత్వాలు మారడంతో నిధుల సమస్య తలెత్తి కాంట్రాక్టర్లు పనులు చేపట్టకుండా అర్ధాంతరంగా ఆపివేశారు. ప్రభుత్వం వెంటనే మినీ స్టేడియాలను నిర్మించాలి. ప్రభుత్వానికి నివేదించాం కామారెడ్డి జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన మినీ స్టేడియాల భవనాల నిర్మాణాలను ప్రారంభించేందుకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. గ్రామీణ స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు మినీ స్టేడియాలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుత ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న మిని స్టేడియలను పూర్తి చేసేందుకు నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు చేసి పంపించాం.
-జగన్నాథం, జిల్లా యువజన సర్వీసుల సంక్షేమ శాఖ, కామారెడ్డి జిల్లా