15-03-2025 08:17:22 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శనివారం నాడు ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపుల్ కమిషనర్-4, దండా శ్రీనివాస్ ఆయన సతీమణి లక్ష్మీ తాయారుతో కలిసి దర్శించుకుని రామయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయం వద్ద అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుగా ప్రధాన దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధిలో ఆశీర్వాదం నిర్వహించి స్వామివారి చేత ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ శ్రీమతి నెల్లూరు సింధు ఇట్ట ఉమామహేశ్వరరావు, సిబ్బంది ప్రియాంక శ్రీమతి రాజేందర్ రెడ్డితో పాటు భద్రాచలం చెందిన చారుగుల్ల శ్రీనివాస్, వెంకట చెంచు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.