calender_icon.png 6 February, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం కోటి 13 లక్షలు

06-02-2025 07:42:29 PM

36 రోజుల తర్వాత తిరిగి లెక్కించిన అధికారులు..

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ఉండి ఆదాయం రూ.1,13,23,178 వచ్చినట్లు ఆలయ ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. స్వామివారి హుండీ డిసెంబర్ 30వ తేదీన లెక్కించగా తిరిగి 30 రోజుల తర్వాత గురువారం నాడు అత్యంత భద్రత నడుమ లెక్కింపు చేపట్టారు. నగదుతో పాటు 19 గ్రాముల బంగారం 895 గ్రాముల వెండి కూడా లభించినట్లు తెలిపారు. వీటితో పాటు అమెరికాకి చెందిన 298 డాలర్లు సింగపూర్ కి చెందిన 150 డాలర్లు ఆస్ట్రేలియాకు చెందిన 85 డాలర్లుతో పాటు ఇతర దేశాలకు చెందిన డాలర్లు ఉండి ద్వారా వచ్చినట్లు ఆమె తెలిపారు. లెక్కింపు అనంతరం వచ్చిన ఆదాయమును బ్యాంక్ అధికారులకు అప్పగించినట్లు కూడా ఈవో రమాదేవి పేర్కొన్నారు.