calender_icon.png 9 January, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయం పుల్.. సౌలత్‌లు నిల్

09-01-2025 12:25:13 AM

  1. ఈ నెల 23 నుంచి జాన్ పహాడ్ దర్గా ఉర్సు 
  2. వక్ఫ్‌బోర్డుకు ఏటా రూ.మూడు కోట్ల ఆదాయం 
  3. రాబడి మీద ఉన్న శ్రద్ధ వసతుల కల్పనపై కరువు
  4. ఇబ్బందులు పడుతున్న భక్తులు

హుజూర్‌నగర్, జనవరి 8: సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని జాన్‌పహాడ్ సైదులు దర్గా ఉర్సు ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరుగనున్నాయి. ఉర్సుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దర్గా వక్ఫ్‌బోర్డు పరిధిలో కొనసాగుతున్నది. సు  నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన  ద  ఉర్సు అనేక సమస్యలు, అసౌకర్యాల నడుమ జరుగుతున్నాయి.

వక్ఫ్‌బోర్డుకు సం  సుమారు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నట్లు తెలుస్తున్నది. ఆదాయం వచ్చినా సౌక ఘ్యలు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. వసతులు లేక ఏటా భక్తులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 

శిథిలావస్థలో గదులు

మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి శుక్రవారం దర్గాకు వచ్చే భక్తులు బస చేయడానికి కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం దాతల సహకారంతో నిర్మించిన వసతి గృహాలు, స్నానపు గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆరుబయటే స్నానాలు, మల  విసర్జనతో దర్గా పరిసర ప్రాంతాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి.

ముఖ్యంగా మహిళలు పరదాల మాటున స్నానాలు చేయడం ఇబ్బంది కలిగించే విషయం. వంటలకు కూడా అష్టకష్టాలే. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉర్సుకు ప్రభుత్వ పెద్దలు హాజరై జాన్‌పహాడ్ దర్గా అభివృద్ధికి హామీలు ఇవ్వడమే కానీ అమలుకు నోచుకోవడం లేదు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్వర్‌రెడ్డి గతంలోనే దర్గాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ఆచరణకు నోచుకోలేదు. 

ఇవి అవసరం

దర్గా వద్ద స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. కాటేజీలు శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి. డ్రైనేజీలు నిర్మించాలి, విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించాలి. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. రోడ్డు వెంట ఉన్న ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి. గతంలో వక్ఫ్‌బోర్డు అధికారులు అక్రమ దుకాణాదారులకు స్వచ్ఛందంగా తొలగించాలని నోటీసులు ఇచ్చారు. ఉత్సవాల ప్రారంభానికి ముందే ఆక్రమణలు తొలగించి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.

రూ.85 లక్షలు మంజూరు

ఈ నెల 23న ప్రారంభమయ్యే జాన్‌పహాడ్ దర్గా ఉత్సవాల్లో మౌళిక వసతుల కల్పనకు ఇప్పటికే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూ.85 లక్షల నిధులు మంజూరు చేయించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఉర్సుకు ముందే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

లోపం అధికారులదా?.. వక్ఫ్‌బోర్డుదా?

దర్గా వద్ద వసతుల కల్పనకు, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు మంజూరు చేస్తుంది. ఆ నిధులతో శాశ్వత వసతులు కల్పించకుండా నామమాత్రపు పనులతో సరిపెడుతూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రతి శుక్రవారం దర్గాకు భక్తులు కందూరు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. దీంతో భారీగానే ఆదాయం వస్తున్నా అధికారులుగానీ, వక్ఫ్‌బోర్డుగానీ వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. 

త్వరలో పనులు ప్రారంభిస్తాం 

దర్గా ఉర్సు ప్రారంభంనాటికి భక్తులకు ఇబ్బంది కలగకుండా కొన్ని శాశ్వ  కొన్ని తాత్కాలి  ఏర్పాట్లు చేస్తాం. భక్తుల అవసరాల మేరకు సౌకర్యాలు కల్పిస్తాం. 

 మహమూద్, జిల్లా వక్ఫ్‌బోర్డ్ ఇన్‌స్పెక్టర్