19-02-2025 12:40:08 AM
-ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ సహకారంతో ఏర్పాటు చేసుకున్న సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పిన యూనిట్ సభ్యులు ఐకమత్యంతో కలిసి మెలిసి పరిశ్రమలు నడుపుకుంటే యూనిట్లు లాభాల బాటలో నడవడమే కాక, ఉపాధి పొంది పదిమందికి ఉపాధి కల్పించవచ్చన వారు అవుతారని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటిసిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ టూల్స్ డిజైన్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఎం ఎస్ ఎం ఈ యూనిట్ సభ్యుల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ సంస్థలో వివిధ శాఖలతో పాటు నిరుద్యోగులైన గిరిజన యువతి యువకుల సౌలభ్యం కొరకు ఎంఎస్ ఎంఈ పథకం ద్వారా వివిధ రకాల చిన్న తరహా పరిశ్రమలు సబ్సిడీ ద్వారా నెలకొల్పి వారి జీవనోపాధికి తోడ్పాటు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, సీఈఓ టిడి సంస్థ డైరెక్టర్ ఉదయ్ కుమార్, శిక్షకుడు విజయ్ కుమార్, జేడీఎం హరికృష్ణ, ఎంఎస్‌ఎంఈ యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.