14-02-2025 01:26:20 AM
* మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం
* కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి): బీసీ జాబితాలో ముస్లింలను చేరిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని.. ఈ విషయం తెలిసి బిల్లును పంపి ఆ బాధ్యతను కూడా కేంద్రంపై నెట్టాలనుకోవడం మూర్ఖత్వమని ఆయన గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.
బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని తేటతెల్లమైందన్నారు. బీసీల్లో ముస్లింలను చేర్చడంవల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేష న్లు దక్కకుండా పోతాయని తెలిపా రు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడం తథ్యమనా ్నరు. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనన్నారు.
స్థానిక ఎన్నికల్లో పోటీచేసే దమ్ము కాంగ్రెస్‌కు లేదని తేలిపోయిందన్నారు. మార్చిలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే తెలంగాణకు నష్టమని తెలియడం లేదా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థలకు ఐదేళ్లకోసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెబుతోందని, రాజ్యాంగాన్ని పట్టుకుని తిరగడం కాదు..రాజ్యాంగాన్ని అమలయ్యేలా చూడాలని హితవు పలికారు.