calender_icon.png 21 April, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతల పేర్లు చేర్చడం కక్ష సాధింపే

18-04-2025 12:00:00 AM

ఆల్ ఇండియా కాంగ్రెస్ ఫిషర్‌మెన్ కమిటీ కార్యదర్శి బిజ్జి శత్రు

ముషీరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): నేషనల్ హెరాల్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్లో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను నామోదు చేయడం ప్రతిపక్షాల పై కక్షసాధింపు చర్యల్లో భాగమేనని ఆలిండియా కాం గ్రెస్ ఫిషర్మెన్ కమిటీ కార్యదర్శి బిజ్జి శత్రు అన్నారు.

ఈ మేరకు గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఈడీ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాకు ముషీరాబాద్ నుంచి బిజ్జి శత్రు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశ్యం తోనే కాంగ్రెస్ నేతలపై ఈడీ కేసులు నమోదు చేశారని ఆరోపించారు.

దేశంలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా మారుతుండడంతో ఇది చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం కాం గ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తుందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

ప్రజల కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ చార్జిషీట్లో నమోదు చేసిన పేర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాము, బాలు, వెంకట్రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.