calender_icon.png 10 January, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎస్‌ఈకే మొగ్గు!

01-08-2024 08:30:00 AM

  1. 98.12 శాతం సీట్లు భర్తీ 
  2. 61,329 సీట్లలో 60,173 సీట్లు ఫిల్ 
  3. రెండో విడత సీట్ల కేటాయింపు 

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ అంటే కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఈ కోర్సు తీసుకు నేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. గత మూడేళ్లుగా సీఎస్‌ఈతోపాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ), సీఎస్‌ఈ అనుబ ంధ కోర్సులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటంతో ఈ కోర్సులనే విద్యార్థులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఒకవేళ మొదటి విడత కౌన్సిలింగ్‌లో సీటు రాకుంటే రెండో విడుతలోనైనా ఆ కోర్సులనే ఆప్షన్ గా పెట్టుకుంటున్నారు. కోర్ బ్రాంచీల్లో చేరకుండా చివరివరకు సీఎస్‌ఈ అనుబంధ కోర్సుల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే బీ (మేనేజ్‌మెంట్) కోటాలోనైనా తీసుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులూ వెనుకాడటం లేదు.  

అనుబంధ కోర్సుల్లో 98.12 % భర్తీ

సీఎస్‌ఈ, ఐటీ అనుబంధ కోర్సుల్లో మొదటి, రెండో విడత సీట్లు కలిపి మొత్తం 98.12 శాతం భర్తీ అయ్యాయి. ఈ కోర్సుల్లో మొత్తం 61,329 సీట్లు ఉండగా, వీటిలో 60,173 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 1156 సీట్లు మాత్రమే మిగిలాయి. ఈ స్థాయిలో సీట్లు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ (కోర్) బ్రాంచీల్లో సీట్లు భర్తీ కాలేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(నెట్‌వర్క్స్), కంప్యూ టర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఏఐ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజి నీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టం కోర్సుల్లో 100 శాతం సీట్లు నిండా యి. అలాగే మిగతా అనుబంధ కోర్సుల్లో 94 శాతం పైగా సీట్లు భర్తీ అయ్యాయి.

కోర్సులు మార్చుకొని సీట్ల పెంపు

దాదాపు మూడేళ్లుగా కోర్ బ్రాంచీల్లో సీట్లు పూర్తిస్థాయిలో నిండట్లేదు. సీట్ల కేటాయింపులప్పుడు 70 నుంచి 80 శాతం సీట్లు ఈ బ్రాంచిల్లోనే భర్తీ అవుతున్నాయి. కానీ, ఆ తర్వాత కాలేజీలకు వెళ్లి రిపోర్టింగ్ చేయకుండా సీట్లను వదులుకొని మేనేజ్‌మెంట్ కోటాలోనైనా సీఎస్‌ఈలో చేరేందు కు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్ కు అనుగుణంగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్ బ్రాంచీ సీట్లను సీఎస్‌ఈకి మార్చుకుంటున్నాయి. ప్రైవేట్ కాలేజీలు దాదాపు 9 వేల సీట్లను కన్వర్షన్‌కు పెట్టుకోగా, ఏఐసీటీఈ 20 వేల కొత్త సీట్లకు అనుమతులిచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కౌన్సిలింగ్ నాటికి కన్వీనర్ కోటా కింద 2,640 సీట్లకు అనుమతినివ్వగా, రెండో విడత నాటికి 7,024 సీట్లకు అనుమతినిచ్చింది. దీంతో రెండో విడతలో సీట్ల సంఖ్య పెరిగింది. 

రెండో విడత సీట్లు కేటాయింపు...

రెండో విడత సీట్లను విద్యార్థులకు అధికారులు బుధవారం కేటాయించారు. మొద టి, రెండు విడతలు కలిపి మొత్తం 86,509 సీట్లలో ఇప్పటివరకు 81,490 (94.20 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడతలో కొత్తగా సీట్లు పొందిన వారు 2,788 కాగా, స్లుడింగ్ ద్వారా సీట్లు పొందిన వారు 22,848 మంది ఉన్నారు. ఇంకా 5,019 సీట్లు మిగిలాయి. 175 కాలేజీల్లో వంద శాతం సీట్లు నిండిన కాలేజీలు 87 ఉన్నాయి. కౌన్సిలింగ్ ద్వారా సీట్లు పొందిన అభ్యర్థులు చివరి విడత కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాతే ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని ఈఏపీసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ శ్రీదేవసేన సూచించారు. అంతకుముందు లాగా రెండో విడత సీట్ల కేటాయింపులు పూర్తయిన తర్వాత వెంటనే కాలేజీల్లో చేరొద్దన్నారు. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆగస్టు 8 నుంచి ప్రారంభంకానుంది. 13వ తేదీ లేదా అంతకంటే ముందు సీట్లను కేటాయించనున్నారు. 16, 17 తేదీల్లో రిపోర్టింగ్ చేయాలి.