calender_icon.png 20 January, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడతెరిపి లేని వర్షం

01-09-2024 01:07:39 AM

రంగారెడ్డి, ఆగస్టు 31 (విజయక్రాంతి):  అల్పపీడనం కారణంగా శనివారం తెల్లవారు జామునుంచి రంగారెడ్డి జిల్లాలోని ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, షాద్‌నగర్, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్  నియోజకవ ర్గాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. ముసురు కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హస్తినపురం, కొత్తపేట్, హాయత్‌నగర్, వనస్థలిపురం, మహేశ్వరం నియోజకవర్గం లోని జిల్లెలగూడ, బాలాపుర్, బడంగ్‌పేట్ లో రోడ్లపై వర్షపు నీరు ఎక్కడిక్కడే నిలిచిపోయింది.

జిల్లాలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. ప్రజలెవరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, శిథిలావస్థకు గురైన ఇళ్లలో నివాసం ఉండొద్దని, ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం అందజేయాలని ప్రజలకు సూచించారు.