calender_icon.png 20 November, 2024 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడతెరిపి లేని వాన

21-07-2024 01:03:22 AM

  • నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్ 
  • ఎఫ్‌టీఎల్‌కు చేరువలో వరద నీరు 
  • మరో రెండ్రోజులు నగరంలో మోస్తరు వర్షం 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి ప్రారంభమై శనివారం రాత్రి దాకా ఎడతెరిపి లేకుండా కురిసింది. వర్షానికి జనజీవనం స్తంభించింది.  కార్యాలయాలకు వెళ్లే వారు, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో పలుచోట్ల రోడ్లపై నిలిచిన వరద నీటిని ఎప్పటి కప్పుడు నాలాల్లోకి తరలించేలా గ్రేటర్‌లోని 30 డీఆర్‌ఎఫ్ బృందాల ద్వారా అధికారులు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా, హుస్సే న్ సాగర్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి భారీగా చేరుతోంది. 513.41 మీటర్ల ఎఫ్‌టీఎల్ కలిగిన హుస్సేన్ సాగర్ నీటిమట్టం శనివారం సాయంత్రం 6 గంట ల సమయానికి 513.23 మీటర్లకు చేరుకుంది. హుస్సేన్ సాగర్‌లోకి 1517 క్యూసె క్కుల వరద నీరు చేరుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో జలకళతో నిండు కుండలా మారింది. హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ 513.41 మీటర్లకు మించి నీరు చేరే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు తూము ద్వారా 998 క్యూసెక్కుల నీటి ని దిగువ ప్రాంతం నాలాలోకి వదిలారు. 

జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 3 సెం.మీ

నగరవ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచే వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహి ల్స్, చందానగర్, కొండాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, గోల్కొండ  తదితర ప్రాం తాల్లో వర్షం కురిసింది. ఈ కారణంగా అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదించి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం రాత్రి 8 గంటల సమాయానికి జూబ్లీహిల్స్ ప్రాంతంలో అత్యధికంగా 3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇది లా ఉండగా, మరో రెండ్రోజుల పాటు నగరంలో మోస్తరు వర్షం వచ్చే అవకాశం ఉన్న ట్టుగా వాతావరణ శాఖ తెలియజేసింది.

అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ 

నగరంలో ఎడతెరిపి లేని వర్షం నేపథ్యం లో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుం డా క్షేత్రస్థాయిలో పర్యటించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. 154 మాన్‌సూన్ బృందాలు, 238 స్టాటిక్ బృందాల ద్వారా ఆయా ప్రాంతాల్లో రహదారులపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుం డా ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కారుపై కూలిన చెట్టు 

రాజేంద్రనగర్: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీ రోడ్డు నంబర్ 9ఈ వద్ద రోడ్డుపై నిలిపిన ఓ కారుపై చెట్టు పడిపోవడంతో కారు పైకప్పు ధ్వంసమైంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డీఆర్‌ఎఫ్, మున్సిపల్ సిబ్బం ది ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో కారుపై పడిపోయిన చెట్టును తొలగించారు. 

కూలిన ఇల్లు 

వికారాబాద్: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. శుక్రవా రం రాత్రి దుద్యాల మండల కేంద్రంలోని ఆకారం రమేశ్ ఇంటి పైకప్పు కూలింది. ఆ సమయంలో కుటుంబీకు లు అందరూ మరో ఇంట్లో పడుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.