calender_icon.png 26 March, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ ప్రైడ్ స్కీం కింద ఇన్సెంటివ్స్ మంజూరు

25-03-2025 01:48:22 AM

వనపర్తి టౌన్ మార్చి 24: పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా ఇండస్ట్రీస్ విభాగం జనరల్ మేనేజర్ జ్యోతి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ టీజీ ఐపాస్ కు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్లు ఏమైనా పెండింగ్లో ఉంటే పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. డిఐపిసి లో భాగంగా టీ ప్రైడ్ స్కీమ్ కింద ఎస్సీ 6, ఎస్టీ 6, పిహెచ్సి 1 లకు సంబంధించిన ఇన్సెంటివ్స్ ని కలెక్టర్ మంజూరు చేశారు. కార్యక్ర మంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.