బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట-1 ఇంక్లైన్ లో ఉత్పత్తిని పెంపొందించడానికి, ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపడానికి బుధవారం సింగరేణి అధికారులు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్పత్తి, ఫిల్లింగ్, రవాణా విభాగంలో సి రిలే ప్రథమ స్థానాన్ని, ఏ రిలే ద్వితీయ స్థానాన్ని పొందింది. ఈ సందర్భంగా సీ రిలే, జనరల్ షిఫ్ట్ రెండవ షిఫ్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 64 మంది ఉద్యోగులను గుర్తించి వారికి ప్రోత్సాహక బహుమతులను సింగరేణి అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ బి.శంకరయ్య, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్, సెక్రటరీ ఎం. లక్ష్మీనారాయణ, సింగరేణి ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.