calender_icon.png 25 November, 2024 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగం డెయిరీ ప్రారంభోత్సవం అడ్డగింత

29-08-2024 04:14:59 AM

  1. మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్‌లో ఉద్రిక్తత 
  2. తమ బకాయిలు చెల్లించాలని పాడి రైతుల డిమాండ్ 

నల్లగొండ, ఆగస్టు 28 (విజయక్రాంతి): మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్‌లో సంగం డెయిరీ ప్రారంభోత్సవాన్ని పాడి రైతులు అడ్డుకున్నారు. తమ పాత బకాయిలు చెల్లించేంత వరకు డెయిరీ ప్రారంభ కానివ్వబోమని భీష్మించారు. దీంతో డెయిరీ యాజమాన్యానికి రైతులకు మధ్య వాగ్వాదం చో చేసుకొని స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో విషయం సద్దుమణిగింది. తెలిసిన వివరాల ప్రకారం.. గతంలో ఇక్కడ వీటీ డెయిరీ ఉండేది.

అది దివాలా తీసి బ్యాంకు రుణాలను సైతం ఎగవేయడంతో బ్యాంకర్లు ఇటీవల డెయిరీని వేలం వేశారు. డెయిరీని సంగం సంస్థ కొనుగోలు చేసింది. బుధవారం ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేయడగా పాడి రైతులు మూకుమ్మడిగా వచ్చి అడ్డుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు సర్ది చెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై డెయిరీ యాజమాన్యాన్ని వివరణ కోరగా.. వీటీ డెయిరీ ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఆంధ్రా ప్రాంతానికి చెందిన సంగం డెయిరీ వీటీ డెయిరీ యాజమాన్యాన్ని దారుణంగా మోసగించిందన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే పాత్ర ఉందని సమాధానమిచ్చారు.