calender_icon.png 25 January, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ అవుట్ పోస్ట్ భవనం ప్రారంభం

24-01-2025 07:01:34 PM

ప్రారంభంలో పాల్గొన్న ఎస్పీ రూపేష్, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి...

నాగల్ గిద్ద: నాగల్ గిద్ద పోలీస్ స్టేషన్ కు పక్కా, సొంత భవనం లేక అద్దె భవనంలో నిర్వహిస్తూ అరకొర వసతులతో సిబ్బంది సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను అధిగమించడానికి, రాష్ట్ర సరిహద్దులో ఉన్న మొర్గి చౌరస్తాలో నూతన పోలీస్ ఔట్ పోస్టు భవనాన్ని నిర్మించి ప్రారంభించామని సంగారెడ్డి ఎస్పీ రూపేష్(SP Rupesh) తెలిపారు. శుక్రవారం నాకలిగిద్ద మండలంలోని మొరిగి చౌరస్తాలో నిర్మాణం చేసిన పోలీసులు అవుట్ పోస్టు భవనమును ప్రారంభించారు. ఎమ్మెల్యే డా.పట్లోళ్ల సంజీవరెడ్డి(MLA Dr. Patlolla Sanjiva Reddy), ఎంపీ సురేష్ కుమార్ షట్కార్(Suresh Kumar Shetkar) తో కలిసి ప్రారంభించారు. నాగల్ గిద్ద పోలీసు స్టేషన్ మంజూరు అయ్యేవరకు ఈ అవుట్ పోస్ట్ నందు నాగల్ గిద్ద పోలీసు స్టేషన్ రన్ అవుతుందని అన్నారు. సిబ్బందికి సరైయన వసతులు కలిపించినప్పుడే పోలీసింగ్ పటిష్టంగా ఉంటుందని, అప్పుడే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని, అందుకు నాగల్ గిద్ద అవుట్ పోస్టు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బీదర్-కర్ణాటక, నాందేడ్-మహారాష్ట్ర రోడ్లను కలుపుతూ వెళ్లే ఈ కూడలిలో నిరంతరం పోలీసుల కదలికల వలనే అక్రమాలకు అడ్డుకట్టా వేయవచ్చు అన్నారు. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. గత సంవత్సరం జరిగిన పోలీసు నియామకాలలో నారాయణఖేడ్ యువత అధిక శాతం పోలీసు ఉద్యోగాలలో భర్తీ కావడం జరిగిందని అన్నారు.

మునుముందు జరిగే పోలీసు నియామకాలలో ఇంకా ఎక్కువగా నియామకం అవ్వడానికి వేసవి సెలవులల్లో నారాయణఖేడ్ యువతకు పోలీస్ నియామకానికి సంబంధించి శారీరదారుఢ్య పరీక్షలలో విజయం సాధించేందుకు శిక్షణ ఇప్పించడం జరుగుతుందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యువత చెడు మార్గాలలో నడవకుండా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. జిల్లాలో గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణాకు తావులేదని ఎలాంటి అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించిన వెంటనే జిల్లా S-Nab నెంబర్ 8712656777 కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సుచించారు. ఎమ్మెల్యే డా. పి. సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. నాగల్ గిద్ద పోలీసు అవుట్ పోస్ట్(Police out post) ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, నాగల్ గిద్ద నూతన పోలీసు స్టేషన్ భవన నిర్మించడానికి కూడా కృషి చేయడం జరుగుతుందన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పోలీసు బెటాలియన్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని జిల్లా ఎస్పీని కోరారు. బెటాలియన్ ఏర్పాటు కాలసిన స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని అన్నారు. జిల్లా పోలీసు శాఖకు నియోజకవర్గం తరపున అన్ని రకాల సహాయకరంగా ఉంటాం అని ఎమ్మెల్యే అన్నారు.

జిల్లా ఎస్పీ సమ్మర్ క్యాంప్(Summer camp) నిర్వహించడం యువతకు ఎంతో ఉపయోగకరం అని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. అనంతరం విశిష్ట అతిథి ఎంపీ శ్రీ సురేష్ కుమార్ షట్కర్ మాట్లాడుతూ... నాగల్ గిద్ద పోలీస్ అవుట్ పోస్ట్ ను ప్రారంభించడం జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ అన్నారు. త్వరలోనే నాగల్ గిద్ద నూతన పక్కా భవనాన్ని నిర్మించడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ అవుట్ పోస్ట్ అనేది ఇతర రాష్ట్రాలతో కలుపుతున్న కూడలిలో ఈ అవుట్ పోస్ట్ ఉండడం వలన ఇతర రాష్ట్రాల నుండి ఎలాంటి అక్రమ రవాణా రకుండా చూడడానికి నిరంతరం పోలీసులుగా అందుబాటులో ఉండటం తరుచూ వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా, రాష్ట్ర సరిహద్దులో ఈ నూతన పోలీసు అవుట్ పోస్ట్ భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరం, హై-రెజల్యూషన్ కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడం జరుగుతుందన్నారు. ఇదే తరహాలో కల్హేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పోలీసు అవుట్ పోస్ట్ ను నిర్మించడానికి కృషి చేస్తానని ఎంపీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎ.సంజీవరావు, నారాయణఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ప్రజలు, సబ్-డివిజన్ పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.