28-02-2025 12:52:58 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి): డోర్నకల్ పట్టణంలో నూతనంగా హెర్బల్ లైఫ్ న్యూట్రీషన్ సెంటర్ ను ముఖ్య అతిథులు సీనియర్ వెల్నెస్ కోచ్ సుబ్బు,మున్సిపల్ వైస్ చైర్మన్, డోర్నకల్ మాజీ సర్పంచ్ కోటిలింగం చేతులు మీదుగాప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ పట్టణంలో ఎస్.బి.ఐ బ్యాంకు సమీపంలోని కాకతీయ గ్రామీణ బ్యాంకు ఎదురుగా ప్రారంభించారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోని మీ వ్యక్తిగత ఆరోగ్యం అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.
మండల ప్రజలకు అందుబాటులో ఈ న్యూట్రీషన్ కేంద్రం ప్రారంభించడం శుభపరిణామమని ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవితానికి ఉచిత ఆరోగ్య సలహల కోసం ఈ కేంద్రాన్ని సంప్రదించలని సూచించారు ప్రతి రోజూ ఉదయం 7గం నుండి 10 గంటలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లెల్ల మాజీ సర్పంచ్ సూరయ్య,హరికృష్ణ, శ్రీకాంత్,ఇంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.