calender_icon.png 1 January, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..

29-12-2024 05:49:19 PM

హైదరాబాద్: అంబర్పేట్ నియోజకవర్గ శ్రీ విశ్వకర్మ సంఘం నూతన 2025 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం ఎస్ ఆర్ జి ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరిగింది. అంబర్పేట్ నియోజకవర్గంలో గల ఏడు సంఘాల ఆధ్వర్యంలో సంఘం చైర్మన్ నాగారం భాస్కర్ చారి అధ్యక్షులు గొట్టాల వినోద్ కుమార్ ప్రధానకార్యదర్శి పోలోజు వేణుగోపాల్ చారి, కోశాధికారి ఉల్లెంగుల కృష్ణమూర్తి చారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు శ్రీ కాలేరు వెంకటేష్, కార్పొరేటర్లు విజయకుమార్ గౌడ్, పద్మా వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు ఆనంద్ గౌడ్, పులి జగన్, లవంగు ఆంజనేయులు, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మను మయ సంఘం అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి, దాసోజు నాగభూషణం చారి, అందోజు దయానందు చారి, రాళ్ళబండి విష్ణు చారి, చెన్నోజు రవికిరణ్ చారి, సంఘ సలహాదారులు సంజీవ చారి, పడకంటి అంజయ్య చారి, పులిమామిడి శ్రీహరి చారి, మేడ్చల్ సంపత్ కుమార్ చారి, దేవరకొండ ఎల్లయ్య చారి, పాల్గొన్నారు.

కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ.. విశ్వకర్మలు రాజకీయంగా ఎదిగినప్పుడే వాళ్ల యొక్క సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని విశ్వకర్మలకు అన్ని విధాలుగా నేను వెన్నంటి ఉంటానని తెలియజేశారు. చైర్మన్ మాట్లాడుతూ.. అందరం ఐకమత్యంతో ఉండాలని కలిసి ఉంటే ఏదైనా సాధించుకోవచ్చని తెలియజేశారు. గౌరవ ఉపాధ్యక్షులు గోపాల్ చారి, రాజు చారి, సురేష్ చారి, శ్రీనివాస్ చారి, మహిళా మణులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.