13-02-2025 08:48:10 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో సోమవారం నుంచి మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇల్లందు మార్కెట్ సెక్రటరీ నరేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో జీపు ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ అవకాశాన్ని టేకులపల్లి మండలంలోని రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలని జీపు ద్వారా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ గార్డ్ మునీర్, వై మధు పాల్గొన్నారు.