calender_icon.png 16 January, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత విపక్షాల ఉచ్చులో పడొద్దు : మంత్రి శ్రీధర్ బాబు

17-07-2024 03:20:09 PM

కడ్తాల్: రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ లో కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను బుధవారం మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. యూపీఏ ప్రభుత్వం కేజీబీవీలను తీసుకొచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. త్వరలో అంతర్జాతీయస్థాయిలో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని, వైద్యం, విద్యకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ ను కడ్తాల్ లో ఏర్పాటు చేస్తామని, వనపర్తిలో ఐటి పార్క్ ఏర్పాటును పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

సర్వారెడ్డిపల్లెలో ఆహారశుద్ధి యూనిట్, ఇండస్టీయల్ పార్క్ తీసుకొస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. రేపు రైతుల పంటల రుణమాఫీ చేయబోతున్నామని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. ఇప్పటికే డీఎస్సీని మూడు సార్లు వాయిదా పడిందని, మళ్లీ వాయిదా వేయడం సరికాదని, యువత విపక్షాల ఉచ్చులో పడొద్దని మంత్రి సూచించారు. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.