ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ భవన ఆవరణలో డ్వాక్రా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను శుక్రవారం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళలు అన్ని విభాగాల్లో ముందు సాగాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుందని తెలియజేశారు. డ్వాక్రా రుణాలు తీసుకుని గ్రూప్ ద్వారా కలిసికట్టుగా వ్యాపారాలు నిర్వహిస్తే మంచి ఫలితాలు అందుతాయని తెలిపారు. మున్సిపల్ భవన ఆవరణలో క్యాంటీన్ ఏర్పాటు చేసినవారికి శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారం పదార్థాలు విక్రయించాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ మేనేజర్ అంకుషావలి, ఎకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, టిపిఓ సతీష్, మున్సిపల్ కౌన్సిలర్లు అంకెపాక నవీన్ కుమార్, కుమ్మరి రవీందర్, సయ్యద్ ఆజం, మెప్మా నాగమణి, మెప్మా సభ్యులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.