* ఇకపై ఈ భవనంలోనే పార్టీ కార్యకలాపాలు
న్యూఢిల్లీ, జనవరి 15: న్యూఢిల్లీలోని దీన దయాళ్ ఉపాధ్యాయ మార్గంలో కాంగ్రెస్ పార్టీ నూతనంగా నిర్మించిన కేంద్ర కార్యాలయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తో కలిసి ప్రారంభించారు.
కార్యాలయానికి ‘ఇందిరా గాంధీ భవన్’గా నామకరణం చేశారు. ఇకపై ఇందులోనే ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. కార్యక్రమం లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు.