08-02-2025 10:59:56 PM
మహేశ్వరం (విజయక్రాంతి): కంచన్ బాగ్ బ్రహ్మ ప్రకాష్ డి.ఏ.వి పాఠశాలలో జ్ఞాన సరస్వతి దేవి విగ్రహావిష్కరణ కార్యక్రమం కన్నుల పండుగగా, అత్యంత శోభాయమానంగా జరిగింది. పాఠశాల ప్రాంగణమంతా వేద మంత్రాలతో, పూజాలతో కళకళలాడింది. ఆధ్యాత్మికత వెలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంగా పాఠశాల ప్రసిద్ధికెక్కింది. వైదిక ధర్మాన్ని బోధించే హవన్ కార్యక్రమం పదవ తరగతి విద్యార్థుల బృందం చేత జరిగింది. విగ్రహదాత ప్రముఖ వ్యాపార వేత్త శ్రీ ఉడుగు రవి కుమార్ మానస దంపతులు వారి తల్లిదండ్రుల దివ్య ఆశీస్సులతో ఈ విగ్రహాన్ని పాఠశాలకు అందించారని వారి కుటుంబానికి ఎల్లవేళలా సరస్వతి దేవి అనుగ్రహం ఉండాలని పాఠశాల ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ శ్రీ గౌరీ శంకరరావు, డి.ఏ.వి పాఠశాల ఏ.ఆర్.ఓ శ్రీమతి ఆనందవల్లి, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ వి.ఎస్. ప్రశాంత్, ఎల్ఎంసి సభ్యులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.